Fri. Apr 3rd, 2020

కరీంనగల్ కాలువలో కుళ్లిపోయిన మృతదేహాల గుర్తింపు…

Peddapalli MLA,Manohar Reddy,Car Accident,Sister

Peddapalli MLA,Manohar Reddy,Car Accident,Sister

15 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి కాకతీయ కెనాల్‌ లో పడిపోయిన ఓ కారు, ఈ ఉదయం బయటపడగా, అందులో రెండు కుళ్లిపోయిన మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ రెండు మృతదేహాలూ పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ, ఆమె భర్త లక్ష్మీపూర్ కు చెందిన సత్యనారాయణరెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ రెండు వారాలకు పూర్వం తమ కుమార్తె వినయ శ్రీతో కలసి బయలుదేరారని, అప్పటి నుంచి అదృశ్యమయ్యారని పోలీసు కేసు కూడా నమోదైంది. అదే రోజున వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక కారులో వినయశ్రీ మృతదేహం కనిపించకపోవడంతో ఆమె కోసం గాలింపు తీవ్రతరం చేశారు. చెల్లులు, బావ మరణంతో కుంగిపోయిన మనోహర్ రెడ్డిని పలువురు రాజకీయ, పుర ప్రముఖులు ఓదార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *