Tue. Sep 22nd, 2020

బదిలీ కోరుకుంటున్న నెల్లూరు కలెక్టర్‍..?

ias seshagiri babu

ias seshagiri babu

ఈ మంత్రితో వేగలేను.. ఎమ్మెల్యేల కోరికలు తీర్చలేము.. అన్ని విషయాలలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అమాత్యులు కలుగజేసుకుంటున్నారు. వారికి అభివృద్ది అవసరంలేదు. సమస్యలను పరిష్కరించక్కర్లేదు. నిబందనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే సూటి పోటీ మాటలు అంటుంటారు. ఈజిల్లాలో కలెక్టర్‍ పోస్టు కత్తి మీద సాము లాంటిది.. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం. అధికార పార్టీలో గ్రూపుల ఆధితప్య పోరు మధ్య నలిగిపోతున్నాం. ఇప్పటి వరకు అధికారం అనే నరకాన్ని చవి చూశాం. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా.. ఎవరికి తృప్తి కలుగటంలేదు. దీర్ఘకాలిక శెలవుపై అయినా వెళ్లాలి. లేదా బదిలీ అయినా చేయించుకోవాలి అని ఒక కలెక్టర్‍ భావిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కలెక్టర్‍ శేషగిరిబాబు బదిలీ పై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికే ముఖ్యమైన వారందరినీ కలిసి అభ్యర్దించినట్లు సమాచారం.

నేను వ్యక్తి గత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారట. 2019 జూన్‍ 6వ తేదీన నెల్లూరు జిల్లా కలెక్టర్‍గా శేషగిరి బాబు బాధ్యతలు స్వీకరించారు. పాలన పరంగా తనదైన ముద్ర వేశారు. ప్రభుత్వ లక్ష్యాలు, సంక్షేమ పధకాల ఫలాలను ప్రజలకు చేరువ చేయటంలో ఆయన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు క్రింది స్థాయి అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అనేక శాఖలకు శాశ్వత అధికారులు లేకున్నా.. ఇంఛార్జి అధికారులతో పాలనలో ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక చొరవ చూపారు. తన బదిలీకి కారణాలను కలెక్టర్‍ శేషగిరి ప్రధానంగా ముఖ్య వ్యక్తుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో కలెక్టర్‍ను బదిలీ చేయాలని అధికార పార్టీ ముఖ్యనాయకులు సిఎంవో అధికారులపై ఒత్తిడి తెచ్చిన విషయంపై ప్రచారం జరిగింది. తనపై కొందరు నేతలు బహిరంగ విమర్శలు చేయటం.. మరి కొందరు ఒత్తిళ్లు తెస్తున్న నేపధ్యంలో హుందాతనంగా తప్పుకుని బదిలీ చేయించుకోవాలని కలెక్టర్‍ శేషగిరి బాబు చేస్తున్న ప్రయత్నాలు త్వరలో ఒక కొలిక్కి రావచ్చంటున్నారు అధికారులు.

కలెక్టర్‍ శేషగిరి బాబు బదిలీ కోరుకుంటున్నారా.. అని మంత్రులతో పాటు కొంతమంది అధికార ప్రతినిధులు వ్యగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారట. శేషగిరిబాబుకు సమర్ధుడైన అధికారిగా పేరు ఉంది. నెల్లూరు జిల్లాలో కలెక్టర్‍గా బాధ్యతలు నిర్వహించాలంటే అధికార పార్టీ నేతలు, అమాత్యులు, ప్రజా ప్రతినిధులు సూచనలు, సిఫార్సులు పాటించాల్సిందే. గతంలో ఈ విధంగా ప్రజా ప్రతినిధుల సూచనలు, సిఫార్సులు ఎంత వరకు అమలు చేశారో కానీ కలెక్టర్‍ శేషగిరి మాత్రం నిబందల ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారని పేరుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *