Sat. Oct 24th, 2020

టీఆర్ఎస్ కు జూపల్లి కృష్ణారావు షాక్

Jupally Krishna,TRS Kolhapur,Municipal Elections

మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. టికెట్లు లభించని నేతలు పలుచోట్ల రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఈ పరిణామాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి. మరోవైపు, రెబెల్స్ తరపున టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రచార పర్వంలోకి దిగడం సంచలనంగా మారింది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో పార్టీ తరపున ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వర్గీయులు బీఫామ్ తో పోటీ చేస్తున్నారు. తన వర్గీయులకు ప్రాధాన్యత లభించకపోవడంతో జూపల్లి ఆగ్రహానికి గురయ్యారు. దీంతో, దాదాపు 20 వార్టుల్లో తన వర్గీయులను ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలోకి దింపారు. అంతేకాదు, వారి తరపున ప్రచారాన్ని కూడా చేపట్టారు. దీంతో, కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారింది.

మరోవైపు జూపల్లి అంశం టీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశంపై ఆరా తీసినట్టు సమాచారం. అందరూ కలసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని కేటీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కొల్లపూర్ కు పంపుతున్నట్టు సమాచారం.
Tags: Jupally Krishna,TRS Kolhapur,Municipal Elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *