Fri. Apr 3rd, 2020

ఫోన్ చేస్తే కరోనా కాలర్ ట్యూన్ వినిపించకుండా ఉండాలంటే… చాలా సింపుల్!

Corona Virus,Caller Tune

ఇండియాకూ విస్తరించిన కరోనా వైరస్, మరిన్ని రాష్ట్రాలకు పాకుడూ ఉండటంతో, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇప్పటికే పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇచ్చిన కేంద్రం, గత రెండు రోజులుగా, ప్రత్యేక కాలర్ ట్యూన్ ను అన్ని ఫోన్ కాల్స్ కు ముందూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి, రెండు సార్లు విన్నవారు, ప్రతి కాల్ కు ముందూ దాదాపు 30 సెకన్ల పాటు ఈ కరోనా అలర్ట్ ను వినాల్సి రావడంపట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దేశంలోని అన్ని టెలికం నెట్ వర్క్ సంస్థలూ ఈ కాలర్ ట్యూన్ ను వినిపిస్తున్నాయి. ఏ నెట్ వర్క్ నుంచి ఏ నెట్ వర్క్ కు కాల్ చేసినా, ఇది తప్పనిసరిగా వినిపిస్తోంది. ఇక ఈ కాలర్ ట్యూన్ ఇంగ్లీషులో ఉండటంతో ఆంగ్లం రానివారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారిలో గందరగోళాన్ని పెంచింది. చాలా మంది కాల్ కలవడం లేదని కట్ చేస్తున్న పరిస్థితి. ఇక రోజుకు ఒకటి, రెండు సార్లు మాత్రం ఈ కాలర్ ట్యూన్ ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఇక, ఈ కాలర్ ట్యూన్ మీకు వద్దని భావిస్తే, ఒకే ఒక్క చిన్న పని చేస్తే సరిపోతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ట్యూన్ మొదలుకాగానే, మీ ఫోన్ డయల్ ప్యాడ్ లో నంబర్ ‘1’ నొక్కితే సరిపోతుంది. వెంటనే కరోనా ట్యూన్ కట్ అయి, ఫోన్ కలుస్తుంది.
Tags: Corona Virus,Caller Tune

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *