Tue. Sep 22nd, 2020

నిద్ర తగ్గితే కష్టమే!

health

health

రాత్రిళ్లు ఆలస్యంగా పడుకొని ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం ఎక్కువ కాలం కొనసాగితే పగటిపూట నిద్రమత్తు వదలదు.
రోజూ 6 గంటలు నిద్రపోతున్నారా, 10 గంటలు నిద్రపోతున్నారా అనేది సమస్య కాదు. ఆలస్యంగా పడుకుంటే జీవ గడియారం దెబ్బతింటుంది కాబట్టి వేళకు నిద్రపోవాలి.

మంచి నిద్ర పట్టాలంటే..!
కెఫిన్‌కు దూరం- సాయంత్రం 4 తరువాత టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌ తీసుకోవద్దు.

ఆహారం- మానసికంగా ఆరోగ్యంగా ఉంటే పేగుల పనితీరు బాగుంటుంది. శుచిగా ఉండే ఆహారమే తినాలి.

దీర్ఘశ్వాస- పడుకునేముందు దీర్ఘశ్వాస తీసుకోవడం వల్ల ఆందోళన తగ్గి త్వరగా నిద్రపడుతుంది.

చురుగ్గా ఉండండి- డ్యాన్స్‌, నడక, వ్యాయామం లాంటివి రోజూ 30 నిమిషాల పాటు చేయాలి.

ఫోన్‌కు దూరం – నిద్రకు రెండు గంటల ముందుగానే ఫోను పక్కన పెట్టేయాలి, సోషల్‌ మీడియాకు దూరం ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *