Tue. Sep 22nd, 2020

సీనియర్ హీరోయిన్ షాకింగ్ లుక్..!

raasi

raasi

స్టార్ హీరోయిన్ గా రాణించిన తెలుగు అమ్మాయి రాశి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యంగ్ జనరేషన్ కి ఆమె పెద్దగా తెలియకపోయినా ఓ దశాబ్దం క్రితం వరకు రాశి మంచి పాత్రలు చేస్తూ వచ్చింది. దాదాపు 30 ఏళ్ల టాలీవుడ్ కెరీర్ కలిగిన రాశి ఖన్నాను ఎవరు మర్చిపోలేరు. ఆమె హీరోయిన్ గా నటించిన పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఇక ట్రెడిషన్ హీరోయిన్ గా ఇమేజ్ ఉన్న ఈమె తేజ తెరకెక్కించిన నిజం చిత్రంలో బోల్డ్ రోల్ కూడా చేసింది. 2017 లో ఈమె లంక అనే ఓ సైకలాజికల్ థ్రిల్లర్ లో నటించారు. ఆ మూవీకి ఆమె నిర్మాత కావడం విశేషం. కాగా ప్రస్తుతం ఓ కొత్త మూవీలో పోలీస్ అధికారిణి పాత్ర చేస్తున్న ఆమె లుక్ షాక్ ఇచ్చింది. బొద్దుగా ఉండే రాశి దాదాపు సగానికి తగ్గిపోయింది. స్లిమ్ గా తయారైన రాశిని చూసి ఎవరూ గుర్తు పట్టలేదంటే అతిశయోక్తి కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *