Wed. Oct 21st, 2020

‘నో హరన్‍’ జోన్‍గా.. తిరుమల

no horn jone

no horn jone

పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఇకపై వాహనాల హారన్‍ శబ్దాలు వినిపించకూడదు. గోవింద నామస్మరణాలు, మంత్రోచ్చరణలు తప్ప ఇతర శబ్దాలు వినిపించకూడదు. అనవసరంగా తిరుమలలో పదే పదే హారన్‍ మోగిస్తున్నారని.. దానికి పులిస్టాప్‍ చెప్పేందుకు తిరుమలను నో హారన్‍ జోన్‍గా ప్రకటించబోతున్నారు. తిరుమల కొండకు చేరుకున్న భక్తులు పాదరక్షలు పక్కన పెట్టి ఎలా నడుస్తారో.. అలాగే.. వాహనదారులు కూడా హరన్‍లు వినియోగించకూడదని ఆదేశాలు జారీ కాబోతున్నాయి. దేశ, విదేశాల నుండి ఇక్కడికి కోట్లాదిమంది భక్తులు వస్తూ ఉంటారు. హారన్‍ల జోరు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో భక్తులు కూడా ఇబ్బందులు పడతున్నారు. ఈ విషయంపై అధికారులు సమావేశమయ్యారని.. త్వరలో నో హారన్‍ జోన్‍గా తిరుమలను ప్రకటించబోతున్నట్లు తెలిసింది.

రాష్ట్రం నుండే కాకుండా.. ఇతర రాష్ట్రం నుండి కూడా లక్షలాది వాహనాలతో భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. ప్రతి దానికి హారన్‍ మోగిస్తూ.. కొంతమంది హడావిడి చేస్తున్నారు. దీంతో నో హారన్‍ బోర్డును త్వరలో ఆవిష్కరించబోతున్నారు. ఈ విధానం అలవాటు అయితే… హారన్‍ వినియోగించకుండా.. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని అధికారుల నమ్మకం. ముందు ముందు పార్కింగ్‍కు ఎలాంటి ఇబ్బందులు ఉండనవి.. ఈ కార్యక్రమం తిరుమలలో విజయవంతం అయితే.. తిరుపతి నగరానికి కూడా విస్తరించే అవకాశం ఉంది. వాహనదారులకు నో హారన్‍ బోర్డులను పోలీసులు చూపుతున్నారు. హారన్ల వినియోగం తగ్గించాలని.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడో తిరుమలను నో హారన్‍ జోన్‍గా ప్రకటించాల్సి ఉన్నప్పటికి.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు. టిటిడి ఛైర్మన్‍లు, ఈవోలు వస్తున్నారు.. పోతున్నారు. కానీ ఏ ఒక్కరికీ తిరుమలను నో హారన్‍ జోన్‍గా ప్రకటించాలన్న ఆలోచన రాలేదు. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ వారికి హ్యాట్సాఫ్‍ చెప్పాలంటున్నారు టిటిడి ఉద్యోగులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *