Sat. Oct 24th, 2020

అన్నయ్య పెళ్ళిలో యంగ్ మహేష్ బాబు..!

mahesh babu

mahesh babu

నేడు సూపర్ స్టార్ మహేష్ అన్నగారైన రమేష్ బాబు పెళ్లి రోజు కావడంతో ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రమేష్ బాబు-మృదుల పెళ్లి ఫొటోలో యంగ్ మహేష్ లుక్ అధ్బుతంగా ఉంది. ఆయన వైట్ కలర్ షర్ట్ టక్ ఇన్ చేసుకొని నవదంపతులైన అన్న-వదినలతో పోజ్ ఇచ్చారు. ఇప్పడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ అక్కగారైన మంజుల కూడా ఆ ఫొటోలో ఉన్నారు.

ఇక మహేష్ తన లేటెస్ట్ మూవీ గత నెలలో ప్రకటించారు. దర్శకుడు పరుశురాం కాంబినేషన్ లో ఆయన సర్కారు వారి పాట అనే చిత్రంలో నటిస్తున్నారు. ఓ భిన్నమైన రోల్ ఈ చిత్రంలో మహేష్ ట్రై చేస్తుండగా,మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 ప్లస్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *