Sat. Oct 24th, 2020

బిగ్ బాస్ హోస్ట్ గా సమంత?

samantha

samantha

బుల్లితెరపై సంచలన విజయం సాధించిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్,తెలుగులో 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైంది. మొదటి సీజన్ ఎన్టీఆర్ నేతృత్వంలో సూపర్ సక్సెస్ కాగా, ఆతర్వాత సీజన్ కి నాని హోస్టుగా ఉండగా మూడవ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించారు. ఇక స్టార్ మా యాజమాన్యం, బిగ్ బాస్ సీజన్ 4 ఏర్పాట్లలో ఉన్నారు.

షో లో పాల్గొనే సెలెబ్రిటీల వేటలో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నారు. ఇప్పటికే కొందరు సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా హీరోయిన్ సమంతను తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ సీజనన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా ఉంటారని వార్తలు వస్తున్నప్పటికీ ఆయన కోడలు అక్కినేని సమంత పేరు కూడా పరిశీనలో ఉందట. మరి అదే జరిగితే షో కి సూపర్ క్రేజ్ రావడంతో పాటు, తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన మొదటి లేడీగా సమంత నిలుస్తుంది. మరి ఈ వార్తలలో స్పష్టత రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *