Wed. Oct 21st, 2020

ఎవరినీ వదలని కరోనా.. !

corona virus

corona virus

రోజు రోజుకు కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. ఆ వ్యాదికి కుల,మత ప్రాంత బేధాలు లేవు. పసి పిల్లలను, వృద్దులనే కనికరం లేదు. పాజిటివ్‍ కేసులలో వాస్తవాలు ఈ విధంగా వెలువడుతున్నాయి. కరోనా వ్యాధికి మందు ఎప్పుడు కనిపెడతారో.. కానీ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోకుంటే.. భారీ మూల్యం చెల్లించాల్సిందే. కరోనా వైరస్‍ ముందు అందరూ సమానమే. ఆడ, మగ, పేద, ధనిక, తేడాలు, వయసుతో నిమిత్తం లేకుండా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు అన్ని వర్గాల వారు కరోనా బాధితులు అయ్యారు. కరోనా పాజిటివ్‍ కేసులు వెల్లడించిన అనంతరం ఈ విషయం స్పష్టమవుతోంది. మార్చి 19న కరోనా తొలి పాజిటివ్‍ కేసు నమోదు కాగా.. ఇప్పటికీ వేలాది కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి.

లాక్‍డౌన్‍ సడలింపుల అనంతరం బయటి ప్రాంతాలవారు జిల్లాలకు రావటం.. ఇక్కడ వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి రావటం.. ఇలా రాక పోకలు జరుగుతుండటంతో కరోనా వ్యాప్తి పెరిగిపోయింది. మొదట నగరాలు, పట్టణాలకు పరిమితమయిన ఈ వ్యాది గ్రామాలకు కూడా పాకిపోయింది. ఒకరి నుండి మరొకరికి కరోనా వైరస్‍ పలువురి అవగాహనా రాహిత్యం, అజాగ్రత్త, నిర్లక్ష్యం వలన కుటుంబాలు, కుటుంబాలు వైరస్‍ బారిన పడ్డారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే.. కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముందు ముందు అవి రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పట్లోఈ వైరస్‍ వ్యాప్తి అదుపులోకి వచ్చే సూచనలు కనిపించటం లేదు. ఎవరికి వారు వ్యక్తిగత, కుటుంబపరంగా జాగ్రత్తలు పాటించటం ఒక్కటే… కరోనా బారి నుండికాపాడుకునే మార్గంగా కనిపిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటింపు, వ్యాది నిరోదక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. కరోనా పట్ల అవగాహన కలిగి ఉండాలి. లక్షణాలు కనిపించిన అనంతరం వైద్యుడిని సంప్రదించాలి.

లేదంటే.. ఏ స్థాయి వారైనా కరోనా బారి నుండి తప్పించుకోవటం చాలాకష్టం. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఐదేళ్ల పసి పిల్లల నుండి 90 ఏళ్లు పైబడిన వృద్దుల వరకు పాజిటివ్‍ కేసులు బయట పడుతున్నాయి. ఇతర వయసుల వారికి కూడా కరోనా వ్యాది సోకుతున్నా.. పిల్లలకు, వృద్దులకు సోకినంతగా ఆ వ్యాది సోకటం లేదు. ఇప్పటి వరకు కరోనా బాధితులలో మహిళల కన్నా పురుషులే ఎక్కువ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబం, ఇతర అవసరాల కోసం బయటకి వెళ్లేవారే కరోనా బారిన పడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *