Wed. Oct 21st, 2020

మెగా హీరో దేశ భక్తి..

allu sirish

allu sirish

నిన్న భారత్ మరియు చైనా సైన్యం మధ్య బోర్డర్ విషయంలో ఏర్పడిన ఉద్రిక్తత 20 మంది భారత జవాన్ల మృతికి కారణం అయ్యింది. ఓ కల్నల్ రేంజ్ అధికారితో సహా మన సైనికులు ఈ పోరులో మరణించారు. చైనా సైన్యం దుర్మార్గపు చర్యను భారత దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికోసం చైనా వస్తువులను బ్యాన్ చేయాలనీ..అదే విధంగా స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనాలని పిలుపునిస్తున్నారు.

ఇదే విషయాన్ని అల్లు వారి చిన్నబ్బాయి హీరో అల్లు శిరీష్ నేడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. చైనా వస్తువులను బ్యాన్ చేయాలని అదే సమయంలో వీలైనంత వరకూ స్వదేశీ వస్తువులను కొనాలి అన్నారు. దీని వలన మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది అన్నారు. అలాగే రెండు రోజుల క్రితం ఆయన షాపింగ్ చేసిన కొన్ని స్వదేశీ వస్తువుల ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. శిరీష్ ఈ నిర్ణయానికి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. ఆయన నిర్ణయానికి భేష్ అని పొగుడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *