Mon. Aug 10th, 2020

పవన్‍ కళ్యాణ్‍ను ముంచింది ఎవరు..?

Pawan-Kalyan

జనసేన అధ్యక్షుడు పవన్‍ కళ్యాణ్‍ను ఎన్నికలలో నిండా ముంచింది ఆయన సామాజికవర్గానికి చెందిన కాపు ఓటర్లా.. లేదా సినీ అభిమానులా..? కాపు సామాజికవర్గ ఓటర్లు పవన్‍ కళ్యాణ్‍ కొంప ముంచారు. అభిమానులు కూడా అత్యుత్సాహంతో.. అతి ధీమాతో పరోక్షంగా పవన్‍ ఓటమికి కారకులయ్యారని విమర్శలు వచ్చాయి. సినిమా ఫీల్డ్లో రారాజుగా ఎదుగుతూ అత్యధిక పారితోషకం తీసుకునే పవన్‍.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఏదో సేవ చేయాలని తపన పడ్డారు. నిజాయితీ పరుడు, మక్కుసూటిగా మాట్లాడతారని పేరుంది. అలాంటి పవన్‍ను ఎన్నికలలో ఓటర్లు ఓడించారంటే… వారు ఎంత ఘోరమైన తప్పిందం చేశారో…? చేతులు కాలక ఆకులు పట్టుకున్న చందంగా అయ్యో పవన్‍ ను మేమేఓడించాం.. అలాంటి నాయకుడని ఓడించి మా చేతులు మేమే కాల్చుకున్నామని.. ప్రస్తుతం కాపు ఓటర్లు.. పవన్‍ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సామాన్య మనుషులు ఒక పొరపాటు కానీ.. తప్పిదం కానీ చేస్తే.. మరో రోజు సరి చేసుకోవచ్చు. కానీ ఓటర్లు ఒక సారి పొరపాటు చేసినా. తప్పుచేసినా వాటిని సరిదిద్దుకునేందుకు ఐదేళ్లు ఎదురు చూడాల్సిందే. పవన్‍కు నిస్వార్ద నాయకుడు కోట్లాది రూపాయల ఆదాయం వదులుకుని ప్రజలకు సేవ చేయాలనుకునే మనిషిగా పేరుంది. ఈవిషయాన్ని ఆయన సామాజికవర్గ ఓటర్లు, ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకోవచ్చు. గతంలో దివంగత నేత ఎన్టీఆర్‍ రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా పేరు తెచ్చుకున్నారో.. పవన్‍ కూడా అదే విధంగా పేరు తెచ్చుకునే పరిస్థితి ఉన్నప్పటికీ.. ఓటర్లు చేసిన తప్పిదాలకు, పొరపాట్లకు ఆ అవకాశం దక్కకుండా నిట్టనిలువునా ముంచారు. తన బహిరంగ సభకు హాజరైన ఓటర్లందరూ జనసేన పార్టీ అభ్యర్ధులకు ఓటు వేసినట్లయితే… 50 నుండి 60 ఎమ్మెల్యేలు గెలిచేవారని.. ఎన్నికల ప్రచారంలో తన సభలకు వేలాది మంది స్వచ్చందంగా వచ్చారని.. కానీ ఓటు మాత్రం జగన్‍కే వేసినట్లుగా ఎన్నికల ఫలితాలను బట్టి స్పష్టమయిందని పవన్‍ అభిమానులు అంటున్నారు.

పవన్‍ను ఓడించి తప్పుచేశామని తాజాగా చెంపలేసుకున్నా.. ఆయనకు జరిగిన అవమానానికి ఆయన రాజకీయ ఎదుగుదలకు ఓటర్లు, అభిమానులే ముఖ్యకారణమని ఈ విషయాన్ని వారు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. పవన్‍ ఓటమికి వీరిద్దరే కారణమని ఆయనను అభిమానించే రాజకీయ విశ్లేషకులు అనేక సందర్భాలలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పది మంది ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి ఉంటే.. జగన్‍ను మూడు చెరువుల నీరు తాగించేవారు. అవినీతి మచ్చలేని పవన్‍పై విమర్శలు, ఆరోపణలు చేయటం ఏ రాజకీయ నాయకుడికి కుదరదు. ఇప్పటికైనా కాపు సామాజికవర్గ ఓటర్లు, పవన్‍ అభిమానులు కళ్లు తెరిచి రాజకీయంగా ఆయనను అందలం ఎక్కిస్తే.. చరిత్రలో మంచి వారిగా మిగిలిపోతారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *