Tue. Sep 22nd, 2020

మంత్రి పదవి ఎవరిని వరించేనో..?!

p.subhash chandhrabose,m.venkataramana,jogi ramesh, venugopal,satheesh

p.subhash chandhrabose,m.venkataramana,jogi ramesh, venugopal,satheesh

పిల్లి సుభాష్‍చంద్రబోస్‍ రాజ్యసభకు ఎంపికైన నేపధ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆయన సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ జిల్లా నుండి బిసి ఎమ్మెల్యేకే మంత్రి పదవి ఇస్తారు.. బోస్‍ శెట్టి బలిజసామాజికవర్గానికి చెందిన వారు.. ఆయన సామాజికవర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే సెల్లుబోయిన వేణగోపాల కృష్ణ మంత్రి పదవి ఆశిస్తున్నారు. అదే సామాజికవర్గానికి చెందిన కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‍ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. మొదటి సారి ఎన్నికలలో గెలిచిన వారికి మంత్రి పదవి జగన్‍ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ వేణుగోపాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్‍ భావించినా ఆయనకు బద్ద వ్యతిరేకి రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే.. తోట త్రిమూర్తులు అడ్డుపడవచ్చు. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వర్గం, వేణుగోపాల కృష్ణ వర్గాల మద్య తీవ్ర విభేదాలున్నాయి. పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. ఈ నేపధ్యంలో తోట త్రిమూర్తులు అడ్డుపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుకు మంత్రి పదవి దక్కదరి త్రిమూర్తులు అనుచరులు బాహాటంగా చెబుతున్నారు. అదే సామాజికవర్గానికి చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‍కు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయని.. త్రిమూర్తులు అనుచరులు ప్రసారం చేస్తున్నారు. అదే విధంగా మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేసిన నేపధ్యంలో ఆసామాజికవర్గానికి చెందిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‍ కుమార్‍ మంత్రి పదవి ఆశిస్తున్నారు. మోపిదేవి స్థానాన్ని సతీష్‍కుమార్‍తో భర్తీ చేయటం ఖాయమని సతీష్‍ అనుచరులు నమ్ముతున్నారు. ఆయన రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. బలమైన మత్య్సకార సామాజికవర్గానికి చెందిన నేత కావటంతో ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని అధికార పార్టీ నాయకులు తెరవెనుక చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *