Mon. Aug 10th, 2020

సిఎస్‍ పోస్టు దక్కేదెరికో..?

ias officers

ias officers

రాబోయే రోజులలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నియమితులు కాబోయే ఐఎఎస్‍ అధికారులలో కొందరి పేర్లు బాగా ప్రచారం అవుతున్నాయి. సర్వీసు నుండి రిటైర్డు అయిన నీలం సహాని సర్వీసును మరో మూడు నెలలు పొడిగించినప్పటికీ.. మళ్లీ ఆమె సర్వీసును పొడిగించే అవకాశాలు ఉండవు. ఈ నేపధ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి జగన్‍ ఏ సీనియర్‍ ఐఎఎస్‍ అధికారిని నియమిస్తారు అనే విషయంపై జరుగుతున్న ప్రచారంలో కొందరు సీనియర్‍ ఐఎఎస్‍ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీనియర్‍ ఐఎఎస్‍ అధికారి ఆదిత్య నాద్‍ దాస్‍, సతీష్‍ చందర్‍, నీరబ్‍ కుమార్‍ ప్రసాద్‍లతో పాటు ఢిల్లీలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‍ అధికారి సమీర్‍ శర్మ పేరుకూడా ప్రచారం జరుగుతోంది.

ఈ నలుగురిలో ముగ్గురు సీనియర్‍ ఐఎఎస్‍ అధికారులు అయిన ఆదిత్య నాద్‍ దాస్‍, సతీష్‍ చందర్‍, నీరబ్‍ కుమార్‍లకు అపార అధికార అనుభవం ఉంది. పదేళ్ల కిందటే.. అనగా ఉమ్మడి రాష్ట్రంలోనే కేంద్ర సర్వీసులకు వెళ్లిన సమీర్‍ శర్మను రాష్ట్ర సర్వీసులకు జగన్‍ పిలిపిస్తారా..? ఇప్పటికే నీలం సహానిని ఆ విధంగా పిలిపించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే.. ఆ పోస్టును సమర్దవంతంగా నిర్వహించటంలో ఆమె ఘోరంగా విఫలమయ్యారని పేరు తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో ఆదిత్యనాద్‍ దాస్‍, సతీష్‍ చందర్‍, నీరబ్‍ కుమార్‍లలో ఒక్కరికి ఆ పోస్టు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో నీరబ్‍ కుమార్‍ దాస్‍ సర్వీసు మిగతా వారి ఎన్నా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఆదిత్య నాద్‍ దాస్‍, సతీష్‍ చందర్‍లో ఒక్కరిని ఆ పదవిలో నియమించే అవకాశాలున్నాయి. వైఎస్‍ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆదిత్య నాద్‍ దాస్‍ను నియమించే అవకాశాలున్నాయని.. అదే విధంగా అపార అనుభవం ఉన్న సతీష్‍ చందర్‍ కూడా అవకాశం ఉందన్న విషయం తోసి పుచ్చలేమని అధికారులు అంటున్నారు.

మరో 70 రోజులు గడువు ఉన్ననేపధ్యంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పోస్టు కోసం ఎవరెవరు ప్రయత్నిస్తున్నారన్న విషయం బయట పడటం లేదు. వీరిలో నీరబ్‍కుమార్‍ ప్రసాద్‍ మాత్రం ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా లో నియమించినా… ఒకే. నియమించకపోయినా.. నష్టం లేదు అనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. చివరకు ఆదిత్యనాద్‍ దాస్‍, సతీష్‍ చందర్‍లలో ఒక్కరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు దక్కే అవకాశాలున్నాయి. సతీష్‍ చందర్‍కు సిఎంవోలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. చంద్రబాబు హయాంలో ఆయన కార్యాలయ ఇంఛార్జిగా సతీష్‍ చందర్‍ పనిచేశారు. అదే విధంగా ఆదిత్యనాద్‍ దాస్‍కు కూడా అపార అనుభవం ఉంది.. ఆయన అందరి పాలిట దేవుడిగా చాలా మంది చెబుతుంటారు. ఇన్నేళ్ల సర్వీసులో ఐఎఎస్‍ అధికారులలో సులభంగా కలిసే అవకాశం ఎంతమందికి ఉందిఅనే విషయం పక్కన పెడితే.. ఆదిత్యనాద్‍ను వెంటనే కలవచ్చు.. సమస్యలను చెప్పుకుంటే వెంటనే పరిష్కరిస్తారు అనే పేరుఉంది. అంతే కాకుండా ఆదిత్యనాద్‍దాస్‍కు ఆపద్బాందవుడిగా కూడా పేరుంది. ఈవిషయంలో ప్రస్తుత ఐఎఎస్‍ అధికారులలో ప్రధమ స్థానంలో ఆదిత్య నాద్‍ దాస్‍ ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి అధికారికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇస్తే బాగుంటుందని క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *