Sat. Oct 24th, 2020

పెట్రో ధరల బాదుడు ఆగేదెప్పుడో..!

petrol

petrol

పెట్రోల్‍, డీజిల్‍ వినియోగాలు తగ్గిపోయాయి. ఒకవైపు కరోనా.. మరో వైపు లాక్‍డౌన్‍ అమలు చేశారు. మెజార్టీ ఉద్యోగులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వినియోగం తగ్గినా… ధరలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. అదేమిటి అంటే.. ధరలు పెంచటంలో ప్రభుత్వ ప్రమేయం ఉండదని కేంద్ర మంత్రి చెబుతుంటారు. ఎప్పటి నుండో ఈ విధంగా అమలు అవుతోంది. దానిని యధావిధంగా అమలు చేస్తున్నాం అని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు కేంద్ర మంత్రి. పెట్రోల్‍, డీజిల్‍ వాడకాలు తగ్గాయి. అయినప్పటికీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఎక్కడ అన్యాయం అని ప్రశ్నిస్తే.. అది అంతే అంటారు అదికారులు. ధరల పెరుగుదల, తగ్గుదలపై ప్రభుత్వ ప్రమేయం ఉండదంటారు కేంద్రపాలకులు. లీటరుకు రూపాయి పెరిగితే.. పన్నులతో కలిపి మరింత రేటు పెరుగుతుంది.

మూడు నెలలవరకు లాక్‍డౌన్‍ కొనసాగింది. 90శాతం వాహనాలు రోడ్లపైకి రాలేదు. వాహనదారులు ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమాయ్యరు. పెట్రోల్‍ బంకులలో పనిచేసేవారు ఈగలు తోలుకున్నారు. అయినప్పటికీ గత 11 రోజుల నుండి పెట్రోల్‍, డీజిల్‍ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజువారీ సవరణలో భాగంగా పెట్రోల్‍, డీజిల్‍ ధరలను పెంచుతూనే ఉన్నాయి. ధర కొద్ది మేరకు పెరిగినా… స్థానిక పన్నులతో భారం అవుతున్నాయి. ప్రతి రోజూ పెట్రోల్‍, డిజిల్‍పై 40 పైసలు నుండి 90 పైసలు వరకు పెరుగుతూనే ఉంది. నిన్న కాక మొన్న అత్యధికంగా లీటరుకు 93 పైసలు పెంచారు. నిన్న పెట్రోల్‍పై లీటరుకు 55పైసలు, డీజిల్‍పై 60పైసలు పెంచటం జరిగింది. 1

1 రోజులుగా పెరిగిన మొత్తం పెట్రోల్‍పై లీటరుకు రూ.6.02పై.లు, డీజిల్‍కు రూ.6.49పై.లు వీటికి స్థానిక పన్నులు అదనం. పెట్రోల్‍, డీజిల్‍ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులపై భారీగా భారం పడుతుంది. పలు జిల్లాలలో పెట్రోల్‍ వినియోగం మొన్నటి వరకు తగ్గినా… తాజాగా కొంత మేరకు పెరిగింది. కరోనా వ్యాది ప్రభావం, లాక్‍డౌన్‍తో మెజార్టీ ప్రజలు పనులు కోల్పోయారు. ఉద్యోగులు సగం జీతాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రైవైటు సంస్థలలో పనిచేసేవారికి పని లేదు. జీతాలు చెల్లించటం లేదు. ఈ సమయంలో పెట్రోల్‍, డీజిల్‍ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంపై మెజార్టీ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *