Wed. Oct 21st, 2020

జీతాలు, ఫింఛన్లు ఎప్పుడు అందేనో..!

employees, pensioners

employees, pensioners

ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు, ఫెన్షనర్‍లకు జీతాలు, ఫెన్షన్లు చెల్లిస్తుంది. కానీ జులై మాసం ప్రారంభం అయి వారం రోజులు అవుతున్నా.. వీరికి జీతాలు జమ అయినట్లు ఎలాంటి మెసేజ్‍లు రాలేదు. బుధవారం నాడు బ్యాంకు ఖాతాలకు జీతాలు, ఫెన్షన్లు జమ అవుతాయని అధికారులు చెబుతున్నప్పటికీ.. చిరుద్యోగులు, ఫెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా 1వ తేదీన లేదా రెండు, మూడు రోజులు ఆలస్యం అయినా.. జీతాలు అందేవి. జులై నెల ప్రారంభం అయి వారం రోజులు గడిచినా.. బ్యాంకు ఖాతాలలో నగదు జమ కాలేదు. ఈ జాప్యంతో చిరుద్యోగులకు, ఫెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. చేతికందే అర కొర సొమ్ముతో ఏ నెలకు ఆ నెల గడుపుతూ…జీతాలు ఎప్పుడు పడతాయో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ద్రవ్య నిధి బిల్లులు ఆర్దిక శాఖ నుండి సిఎంఎంస్‍కు వెళ్లాయని ఖజానా శాఖ అధికారులు చెబుతున్నారు. అక్కడి నుండి పలు అనుమతుల ద్వారా ఈ-కుబేర్‍ సైటుకు వివరాలు చేరుకోగానే.. వేతనాలు, ఫెంచన్ల చెల్లింపులు జరుగుతాయని అంటున్నారు. వారం రోజులు గడిచినా పరవాలేదు.. రేపైనా జీతాలు పడితే బాగుండు అని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జీత భత్యాల చెల్లింపుల బిల్లుకు శాసనసమండలిలో టిడిపి అడ్డుపడుతుందని.. అందుకే జాప్యం జరిగిందని పలువురు మంత్రులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు నేతి బీర కాయలో నెయ్యి ఉంటుంది అన్న చందంగా ఉందని అధికారులు, ఉద్యోగులు అంటున్నారు. శాసనసభ ఆమోదించిన బిల్లును.. శాసనమండలిలో ప్రవేశ పెట్టండి… వెంటనే ఆమోదిస్తాం అని టిడిపి ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ.. ముందుగా ఈబిల్లు పెట్టకుండా.. మూడు రాజధానుల బిల్లు పెడితే… టిడిపి నేతలు అడ్డుకున్న విషయం విధితమే. చంద్రబాబుపై వ్యతిరేకత పెంచేందుకు అధికార పక్షం ఆడిన ఆటలు అంతగా సాగలేదు. ద్రవ్యనిధి బిల్లును శాసనమండలిలో పెడితే.. టిడిపి తప్పకుండా ఆమోదించేంది అని ఉద్యోగులకు తెలుసు. బంతిని గోడకి వేసి కొడితే.. వెనక్కివస్తుందన్న విషయాన్ని తెలిసి కూడా ఇంకేదో అవుతోందని భావిస్తే… ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయంటున్నారు రాజకీయ పరిశీలకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *