Sat. Oct 24th, 2020

కలెక్టర్‍ గారి ఏకాంతంలో.. ఆంతర్యం ఏమిటో..?

gandham chandrudu

gandham chandrudu

అనంతపురం జిల్లా కలెక్టర్‍ గంధం చంద్రుడు వ్యవహారశైలే వేరు.. ఆయన అనంతపురం జిల్లా కలెక్టరే కాదు… నగరపాలక సంస్ధ ప్రత్యేక అధికారిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక అధికారి హోదాలో అప్పుడప్పుడు నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తుంటారే తప్ప సమస్యలను ప్రస్తావించరట. గంటల కొద్దీ తన ఛాంబర్‍లో ఏకాంతంగా గడుపుతుంటారట. ఏకాంతం అంటే… కలెక్టర్‍గారికి అంత ఇష్టం ఏమిటో.. ఏ ఒక్కరికీ అంతుబట్టడం లేదు. నగరంలోని కంటైన్మెంట్‍జోన్లు పరిశీలిద్దాం.. రెడీగా ఉండమని చెప్పి కార్యాలయం నుండి గంటల తరబడి బయటకు రారట. అదిగో.. కలెక్టర్‍గారు బయటకు వెళదామన్నారు.. మీరు కూడా రండి అన్నారు. కార్యాలయంటో కూర్చున్నారు.. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాం… అని కలెక్టర్‍ కోసం ఎదురు చూసే అధికారులు, ఉద్యోగులు తమకు ఫోన్లు చేసిన వారికి చెబుతున్నారట.

కలెక్టర్‍ గందం చంద్రుడు వారానికి ఒక రోజు ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలోఏకాంతంగా గడుపుతుంటారని అధికార, ఉద్యోగ వర్గాల సమాచారం. ఆయన కార్యాలయాలకు ఇలా వచ్చి… ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా.. సమస్యలు ప్రస్తావించకుండా.. అలా వెళ్లిపోతుంటారు.. ఇది మాకు కొత్త కాదు అంటున్నారు అధికారులు, ఉద్యోగులు. ఈ విధంగా కలెక్టర్‍ గందంచంద్రుడు ఎప్పటి నుండో ఇదే కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారట. జిల్లా కలెక్టర్‍ ఏమిటి.. ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు రావటం ఏమిటి.. గంటల తరబడి ఏకాంతంగా ఆ కార్యాలయాలలో కూర్చోవటం ఏమిటి..? సమస్యలను ప్రస్తావించక పోవటం ఏమిటి… ఇదంతా గతంలో తాము చూసిన సినిమాలో దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *