Tue. Sep 22nd, 2020

ఆళ్లనాని మౌనం వహించటంలో మర్మం ఏమిటి..?

alla nani

alla nani

ఒకవైపు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి నిత్యం తెరపైకి వస్తూ.. కరోనా వ్యాది వివరాలు తెలుపుతున్నారు. విపక్షాల నేతల విమర్శలకు, ఆరోపణలకు ధీటుగా బదులు ఇస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో కానీ ఈ శాఖకు తాను మంత్రిగా ఉన్నానన్న విషయాన్ని ఆయన మరిచిపోయి ఉంటారేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖాదిపతి జవహర్‍రెడ్డి మాత్రమే అప్పుడప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించి వివరాలు తెలుపుతున్నారు. ఆళ్ల నాని ఎందుకో మౌనం వహిస్తూ ముఖం చాటేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కరోనా వ్యాది వ్యవహారాలు అధికారులు చూసుకుంటారు… మీరు తల దూర్చకండి అని మంత్రికి ముఖ్యమంత్రి జగన్‍ సూచించారా అని అధికారులకు అనుమానంగా ఉందట.

వైద్య, ఆరోగ్య శాఖాదిపతితో పాటు ఆ శాఖ ముఖ్య అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. రోజుకు 15గంటలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ మంత్రి ఆళ్ల నాని మాత్రం అమరావతిలో కనిపించటం లేదు. ఒకవేళ విజయవాడలో ఉంటే ఎక్కడున్నారో బయట పడటం లేదు. ఏలూరులో ఉంటున్నారన్న విషయం కూడా తెలియటం లేదు. అధికారులపై భారం వేసి మంత్రి నాని విశ్రాంతి తీసుకుంటున్నారేమో అని వ్యగ్యంగా పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి నిత్యం మీడియా ముందుకు వచ్చి వివరాలు తెలుపుతుంటే.. ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ఈ మూడు నెలల్లో ఎన్ని దఫాలు తెరిపైకి వచ్చారన్న విషయం వేళ్ల మీద లెక్కపెట్టవచ్చునని అంటున్నారు అధికారులు. గత మూడు, నాలుగు నెలల నుండి వైద్య ఆరోగ్యశాఖాదిపతి జవహర్‍రెడ్డి మాత్రమే మీడియాకు వివరాలు తెలుపుతున్నారు.ఇంతకీ ఆరోగ్యశాఖ మంత్రి నానికి ఆశాఖపై ఇష్టం లేదా..? లేదా ముఖ్యమంత్రి కరోనా వ్యాది వ్యవహారంలో తలదూర్చవద్దని ఆదేశించారా అనే విషయం బయట పడటం లేదు. ఈ విషయాలపై ఆరోగ్య శాఖాదిపతి జవహర్‍రెడ్డి కూడా పెదవి విప్పటం లేదు. ఏదో జరిగి ఉంటుంది. అది ఏమిటో ఎవరికి తెలియటం లేదు. అంతా రహస్యంగా ఉంది. ఎప్పుడు బయట పడుతుందో లేదా అసలు బయట పడుతుందా లేదా అన్న విషయంపై ఎవరూ ఏమి ఊహించలేకపోతున్నామంటున్నారు అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *