Wed. Oct 21st, 2020

ఉండవల్లి కులం కేసు కంచికి వెళ్లినట్లేనా..?

undavalli sridevi

undavalli sridevi

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తప్పుడు కుల ధృవీకరణ పత్రంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని..ఆధారాలతో రాష్ట్రపతికి పలువురు ఫిర్యాదు చేయటం.. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల కమీషన్‍ను ఆదేశించటం.. ఎన్నికల కమీషన్‍ ఆదేశాలతో గుంటూరు జిల్లా కలెక్టర్‍ దినేష్‍కుమార్‍ ఆ కేసుపై విచారణ జరిపినా.. ఇంత వరకు ఆయన నివేదిక అందజేశారా.. లేదా.. ఆ నివేదికలో శ్రీదేవిపై వచ్చిన కుల ఆరోపణలు వాస్తవమా… కాదా అనే విషయం బయట పడటం లేదు. శ్రీదేవి దళిత సామాజికవర్గానికి చెందిన మహిళ కాదని.. ఆమె క్రైస్తవ మతానికి చెందిన వారని.. ఈ విషయాన్ని కొన్ని సందర్భాలలో ఆమె స్వయంగా చెప్పిన వీడియో ఆధారాలు జాయింట్‍ కలెక్టర్‍ దినేష్‍కుమార్‍కు పలువురు అందజేశారట.

అంతే కాకుండా.. ఆమె చర్చికు వెళ్లిన ఫొటోలు, వీడియోలు కూడా రాష్ట్రపతికి అందజేసిన ఫిర్యాదులో పొందు పరిచారు. తాను క్రిస్టియన్‍ అని స్వయంగా చెప్పిన ఉండవల్లి శ్రీదేవి కొంతమంది అధికారుల తోడ్పాటుతో దళిత మహిళగా సర్టిఫికెట్‍ తీసుకున్నారని విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి క్రైస్తవ మతస్థురాలు అని ఆమె బంధువులు కూడా చెబుతున్నారట. ఆరు, ఏడు నెలల కిందట జాయింట్‍ కలెక్టర్‍ దినేష్‍కుమార్‍ విచారణకు శ్రీదేవి హాజరు అయ్యారు. తాను క్రైస్తవ మతస్థురాలుని కాదు.. దళిత మహిళ అని ఆధారాలు అందజేసినట్లు తెలిసింది. కానీ అంతకు ముందు ఆమె మాట్లాడిన మాటలు వీడియోలో బయట పడ్డాయి. ఇంతకీ శ్రీదేవి దళిత సామాజికవర్గానికి చెందిన వారా… కాదా… అనే విషయంపై విచారణ జరిపి నివేదిక పంపాల్సిన దినేష్‍ కుమార్‍ ఇంత వరకు ఆ విషయంపై పెదవి విప్పలేదు. ఎవరైనా అడిగినా మౌనం వహిస్తున్నారట.

ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, మంత్రులు, అధికార పార్టీ ప్రతినిధుల ఒత్తిళ్లు దినేష్‍కుమార్‍పై పనిచేశాయా..? ఆయన నిబందనల ప్రకారమే నివేదిక తయారు చేసి ఎన్నికల కమీషనర్‍కు పంపారా.. లేదా… అన్న విషయాలు బయటకు రావటం లేదు. మరోనాలుగు సంవత్సరాలు ఈ విధంగానే పరిస్థితి ఉంటుంది. అధికార పార్టీతో జాయింట్‍ కలెక్టర్‍ దినేష్‍కుమార్‍ తగవు పెట్టుకోలేరు కదా… ఏది ఏమైనా ఉండవల్లి శ్రీదేవి కుల విషయంలో జాయింట్‍ కలెక్టర్‍ దినేష్‍కుమార్‍ సరైన నిర్ణయాన్ని తీసుకుని నివేదిక పంపుతారని ఫిర్యాదు చేసిన వారు ఆశిస్తున్నారు. కానీ ఉండవల్లి కులం కేసు ఏ స్థాయిలో ఉందో బయట పడటం లేదు. దీనిని బట్టి శ్రీదేవి కులం కేసు కంచికి చేరినట్లుగా భావించవచ్చునేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *