Wed. Oct 21st, 2020

ఈ నగరాలలో సడలింపులులేని లాక్‍డౌన్‍ పెట్టకుంటే..!

corona city s

corona city s

రోజు రోజుకు కరోనా పాజిటివ్‍ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఖాతరు చేయటం లేదు. 13 జిల్లాలలో కొన్ని నగరాలు, పట్టణాలలో కరోనా వ్యాప్తి తీవ్రం అవుతోంది. పాజిటివ్‍ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపధ్యంలో మళ్లీ లాక్‍డౌన్‍ విధించకుంటే.. ప్రమాద ఘటికలు ఎదురవుతాయని అధికారులు అంటున్నారు. కంటైన్మెంట్‍ జోన్లు, రెడ్‍ జోన్లు ఏర్పాటు చేసినా.. ప్రజలు నిబందనలు పాటించకుండా.. బయటకు మాస్కులు దరించకుండా వస్తున్నారు. భౌతిక దూరం పాటించటం లేదు. దీంతో పలు నగరాలలో, పట్టణాలలో లాక్‍డౌన్‍ విధించే అవకాశం లేకపోలేదు. ఎప్పటి నుండి లాక్‍డౌన్‍ అమలు చేయాలనే విషయంపై అధికారులలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని జిల్లాలు, పట్టణాలలో లాక్‍డౌన్‍ విధించారు. విజయవాడలో శుక్రవారం నుండి లాక్‍డౌన్‍ విధిస్తామని చెప్పిన కలెక్టర్‍ ఆతరువాత ఏ తేదీ నుండి అమలు చేస్తామో చెబుతామన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే.. మరోసారి సడలింపులు లేని లాక్‍డౌన్‍ అమలు చేయాలని అధికారులంటున్నారు. ఐదో విడత లాక్‍డౌన్‍లో ప్రభుత్వం ఇచ్చిన సడలింపులే కొంప ముంచబోతున్నాయి.

రోడ్లపై ప్రజలు యధేచ్చగా తిరుగుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా.. మాస్కులు దరించటం లేదు. ఆటోలు, ప్రవైటు వాహనాలలో విచ్చలవిడిగా ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. మాంసం దుకాణాలు, చేపల దుకాణాల వద్ద గుంపులు, గుంపులుగా ప్రజలు కనిపిస్తున్నారు. బ్రతిమాలినా.. బుజ్జగించినా… బెదిరించినా..ప్రజలు ఖాతరు చేయటం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పరిస్థితి అదుపులో ఉంది. మళ్లీ సడలింపు లేని లాక్‍డౌన్‍ ప్రకటిస్తేనే.. పరిస్థితి అదుపులోకి వస్తుంది. లేకుంటే ఇంతే సంగతులు. ముఖ్యంగా విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, కర్నూలు, ఏలూరు, తిరుపతి, నెల్లూరు నగరాలలో సడలింపులు లేని లాక్‍డౌన్‍ను నెల రోజులు నిర్వహించగలిగితే.. కరోనాను అదుపులో పెట్టవచ్చు. ఈ నగరాలలో రోజుకు 30 నుండి 50 కరోనా కేసులు బయట పడుతున్నాయి.

ఆయా జిల్లాలలో ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లు మాత్రమే మళ్లీ లాక్‍డౌన్‍ విదించకుంటే..పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నారని.. మిగతా కలెక్టర్లు ఇతర వ్యాపకాలతో కాలం గడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాలి అని చెప్పాల్సిన కలెక్టర్లలో ఒకరిద్దరు మాత్రమే అలా చేస్తున్నారు. మిగతా వారు అందరూ ఇది పెద్ద సమస్య కాదన్నట్లుగా తేలికగా తీసుకున్నట్లుగా పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజుకు 500 కేసులు బయట పడుతుంటే ఆ కేసులు ఏయే నగరాలలో బయట పడుతున్నాయనే విషయం అధికారులకు తెలిసినా… ఎక్కువ మంది చొరవ తీసుకోకుండా… ఇది మా బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయా నగరాలు, జిల్లాల అమాత్యులు, ప్రజా ప్రతినిధులు ఈ కరోనా వ్యాది విషయంలో ఏ కారణాలతో స్పందించటం లేదు. అసలు విషయం ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లటం లేదు. కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్న చందంగా కలెక్టర్లకు లేని బాధ్యత మాకు ఎందుకులే అని వారందరూ అనుకుంటున్నారేమో అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *