Wed. Oct 21st, 2020

ఆ ముగ్గురు ఐఎఎస్‍లకు కరోనా సోకినా…?

ias

ias

సిఎంవోలో పనిచేసే ఒక ఐఎఎస్‍ అధికారికి ఇద్దరు మహిళా అధికారులకు కరోనా సోకిందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో వారిని ఎంత మంది.. ఎక్కడెక్కడ కలిశారు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు కనిపించటం లేదని ప్రచారం జరుగుతోంది. ముగ్గురు ఐఎఎస్‍ అధికారుల కార్యాలయాలలో పనిచేసే ఆంతరంగిక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారా.. లేదా అనే విషయం కూడా బయట పడటం లేదు. ఆ ముగ్గురు అధికారులు దగ్గర పనిచేసే ఆంతరంగికులు కానీ.. ఆ ముగ్గురు కలిసిన ఇతర అధికారులకు కానీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. వారందరికీ కరోనా పాజిటివ్‍ బయట పడటం ఖాయమనే ప్రచారాన్ని అధికారులు, డాక్టర్లు కొట్టి పారేస్తున్నారు. ఇంతకు ముందు చాలా మందికి కరోనా వచ్చింది. వారు ఆసుపత్రిలో చేరారు.

వారి కుటుంబ సభ్యులకు, వారిని కలిసిన ఇతరులలో అందరికీ కరోనా సోకలేదు. అక్కడక్కడ కుటుంబసభ్యులకు, ఇతరులకు కరోనా బయట పడిందే తప్ప వారిని కలిసిన వారిలో ఎక్కువ మందికి కరోనా బయట పడలేదు. తాజాగా ఈ ముగ్గురు ఐఎఎస్‍ అధికారులను కలిసివారు, వారి ఆంతరంగిక సిబ్బంది ఎంతమంది ఉన్నారు… వారిలో ఎంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించారో.. వారికి పాజిటివ్‍ ఫలితం బయట పడిందా.. నెగటివ్‍ ఫలితం బయట పడిందా.. అనే విషయం బయటకు పొక్కటం లేదు. వారిలో కొంతమందిని హౌస్‍ క్వారంటైన్‍కు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. సిఎంవో అధికారిని ఎంతో మంది ఐఎఎస్‍ అధికారులు, మంత్రులు, అధికార పార్టీ ప్రతినిధులు కలిసి ఉంటారు. అలాంటి వారి వివరాలను అధికారులు స్వీకరించారా.. లేదా అనే విషయం కూడా బయటకు పొక్కటం లేదు.

మహిళా ఐఎఎస్‍ అధికారులను కూడా అధికారులు, ఉద్యోగులు ఎంతో కొంత మంది కలిసి ఉంటారు.. ఆ ఇద్దరిని ఎంతమంది ఎప్పుడు కలిశారు అనే విషయం కూడా బయట పడటం లేదు. ముగ్గురు ఐఎఎస్‍ అధికారులకు కరోనా బయట పడినా.. వారిని కలిసిన వారి వివరాలు సేకరించటంలో అధికారులు ఎక్కువగా పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటో.. ఎవరికీ తెలియటం లేదు. అంతా గోప్యంగా ఉంచుతున్నారు. ఎంతమందిని హౌస్‍ క్వారంటైన్‍కు పంపించారు.. ఎంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.. వాటి ఫలితాలు ఏమిటి అనే విషయం రహస్యంగా ఉంచుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *