Wed. Oct 21st, 2020

సబ్సీడి రుణాలు హుళక్కేనా..?

corporations

corporations

చంద్రబాబు హయాంలో బిసి, దళిత, గిరిజన,కాపు, మైనార్టీ, కార్పోరేషన్ల ద్వారా పేదలకు స్వయం ఉపాదికి ఉపయోగపడే సబ్సీడి రుణాలను లక్షలాది మందికి అందజేయటం జరిగింది. జగన్‍ ముఖ్యమంత్రి అయి ఏడాది పూర్తయింది. 13 జిల్లాలలో ఆ వర్గాలకు కార్పోరేషన్‍ ద్వారా ఒక్క రుణం కూడా మంజూరు చేయలేదు. అంతకు ముందు ఏడాది మంజూరు అయిన రుణాలను కూడా రద్దు చేశారు. దీంతో లబ్దిదారులు లబో దిబో మని వాపోయారు. ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు లభించలేదు. ఆర్దిక సంవత్సరం ముగిసినా ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. సబ్సీడి రుణం తీసుకుని ఏదో ఒక స్వయం ఉపాది పొందుదామని ఆశపడ్డ పేదలకు నిరాశే మిగిలింది.

గతంలో సబ్సీడి రుణాలను మంజూరు చేస్తూ.. అర్హులైన వారు ఎంచుకున్న యూనిట్లను బట్టి లక్ష వరకు సబ్సీడి పొందే అవకాశాలుండేవి. కిరాణ కొట్టు, గార్మెంట్సు, క్రషర్స్ ఇతర స్వయం ఉపాధి యూనిట్లకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. 2019-20లో చాలా మంది పేదలు సబ్సిడి రుణాలపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలపై పాలకులు నీళ్లు చల్లారు. సబ్సీడి రుణాలను అందజేయటం ప్రభుత్వం నిలిపివేసింది. కానీ సబ్సీడి రుణాలు ఇస్తాం.. దరఖాస్తు చేసుకోమని అధికారులు పిలుపు నిచ్చారు. 13 జిల్లాలలో లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం రుణాల విషయం పట్టించుకోలేదు. ఒక్కో కులానికి ఒక్కో కార్పోరేషన్‍ ఏర్పాటు చేసినప్పటికీ వాటి ఫలితలు అందలేదు. అధికారులు జీత భత్యాలకు మాత్రమే కార్పోరేషన్లు పరిమితమయ్యాయని కొందరు అంటున్నారు. గత సంవత్సరం సబ్సీడి రుణాలు ఇవ్వలేకపోయినా.. ప్రభుత్వం ఈ సంవత్సరం అయినా అందజేస్తుందా అనే విషయంపై అధికారులు పెదవి విప్పటం లేదు. ఇదే కాకుండా పశుసంవర్దక శాఖ ఆధ్వర్యంలో కూడా పశువులు, గొర్రెలు, మేకలు పెంపకానికి సబ్సీడితో కూడిన రుణాలను ప్రభుత్వం అదించింది.

ఈరుణాలతోగ్రామీణ ప్రాంతాల ప్రజలు స్వయం ఉపాధి పొంది ఆర్దికంగా లాభపడ్డారు. అయితే ఈ రుణాలకు కూడా జగన్‍ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఎంత కాలం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తాం.. ఆ జీతాలతో ఇంటిని పోషించలేక పోతున్నాం. ప్రభుత్వం ఆ రుణాలను అందజేస్తే.. దానివలన ఉపాది పొందాలనుకున్న వారికి కరోనా వ్యాది అడ్డుపడింది. కరోనా వ్యాది లేనప్పుడు రుణాలు ఇచ్చారా…? తాజాగా కరోనా వ్యాది బూచితో ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. అసలు కార్పోరేషన్‍ రుణాలను అందజేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా.. ఇదంతా మమ్ములను మాటలతో మభ్య పెడుతూ ప్రభుత్వం మోసి చేసింది. జగన్‍ ముఖ్యమంత్రి అవుతారు.ఇంకా ఎక్కువ రుణాలు అందజేస్తారు.. మేము ముందుకు వెళతాం.. అని ఆశపడ్డాం. అసలుకే ఎసరు వచ్చింది. సబ్సీడి రుణాలు అందుతాయన్న ఆశ బిసి,ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కనుచూపు మరేలో కనిపించటం లేదని ఆయా సంఘాల నాయకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *