Wed. Oct 21st, 2020

విద్యార్ధులు రారు.. టీచర్లు, హెచ్‍ఎంలు రావాలని ఆదేశాలా..?

govt school

govt school

ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నీ మూసి వేశారు. విద్యార్ధులు స్కూళ్లకు రావటం లేదు. అయినప్పటికీ.. స్కూళ్లను తెరవాలని, హెడ్‍ మాష్టర్లు, టీచర్లు తప్పనిసరిగా స్కూళ్లలో ఉండాల్సిందే అని ప్రభుత్వం జారి చేసింది. ఈ ఉత్తర్వులపై కొందరు టీచర్లు స్పందిస్తూ.. పిల్లలు స్కూళ్లకు ఆరు.. మేము వెళ్లి ఏం చేయాలి… ఒక వైపు కరోనా తీవ్ర రూపం దాల్చుతుంటే… మమ్ములను స్కూళ్లకు ఎలా రమ్మంటున్నారు అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మొదట్లో వేలి ముద్రలు వేస్తే.. కరోనా వైరస్‍ సోకుతుందంటూ బయో మెట్రిక్‍ అవసరం లేదన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాధి విజృంభిస్తుంటే బయోమెట్రిక్‍ వేయాలంటున్నారట. పిల్లలు స్కూళ్లకు రాకున్నా.. వీరందరూ స్కూళ్లకు రావాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం ఏమిటి…? పిల్లలు స్కూళ్లకు రారు.. మేము మాత్రం స్కూళ్లకు వచ్చి ఏం చేయాలి..? కొన్ని ప్రాంతాలలో లాక్‍డౌన్‍ అమలు జరుగుతుంది. కంటైన్మెంట్‍ జోన్లు ప్రకటించిన జోన్లలో చాలా మంది నివాసం ఉంటున్నారు. ఈనేపధ్యంలో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఉపాద్యాయ సంఘాలు డిమాండ్‍ చేస్తున్నాయి.

ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‍ను అధికారులు తప్పుదోవ పట్టించారా.. ఆయన అనుమతితోనే ఉత్తర్వులు జారీ అయ్యాయా అనే విషయం తెలియాల్సి ఉంది. జూన్‍ 22 నుండి స్కూళ్లకు రావాలంటూ సోమవారం విద్యాశాఖ కమీషనర్‍ ఉత్తర్వులు జారీ చేశారు. నాడు-నేడు పనులు, పిడి అకౌంట్స్, పిల్లల షూ కొలతలు, తదితర పనులు నిమిత్తం లెక్చలర్లు, టీచర్లు స్కూళ్లకు వెళ్లాలంటూ ఉత్తర్వులు వచ్చాయి. పాళశాలలకు పిల్లలు రాకున్నా.. ఉపాధ్యాయులు పనిచేస్తే… బూట్ల కొలతలు ఎలా తీసుకుంటారు. పాళశాలలకు వెళ్లేందుకు మాకు అభ్యంతరం లేదు. పిల్లలు లేకుండా మేం చేసేది ఏమీ లేదు. ఆపని ఈ పని చేయాలంటున్నారు. కంప్యూటర్‍లు ఇతర సామాగ్రి లేకుండా.. ఎలా అప్‍లోడ్‍చేయాలి. మాప్రాంతాలలో లాక్‍డౌన్‍ ఉంది. మేము కంటైన్మెంట్‍జోన్లలో ఉంటున్నాం. ఒకవేళ బయటకు వచ్చి దూరం వెళ్లాలంటే పోలీసులు ఆంక్షలు, రవాణా సదుపాయాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని టీచర్ల సంఘాలు డిమాండ్‍ చేస్తున్నాయి. లాక్‍డౌన్‍ ఉన్న ప్రాంతాలలో బయటకు రావటమే ప్రమాదకరం.. మహిళా టీచర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడే వారు ఎలా స్కూళ్లకు రాగలుగతారు. ఈ విషయంపై అధికార అనుభవం ఉన్న అధికారులు పాలకులకు నచ్చ చెప్పకుండా ఉత్తర్వులు ఎలా జారీ చేశారు. వారు చేయమన్నది చేసి చేతులు దులుపుకున్న చందంగా పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు కొంతమంది టీచర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *