Tue. Sep 22nd, 2020

పరీక్షలు చేశారు.. ఫలితాలు చెప్పండి… ఫ్లీజ్‍..!

corona test

corona test

గడిచిన నెల రోజులుగా 13 జిల్లాలలో కరోనా కేసులు రోజు రోజుకు వేగంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు 50 వస్తే.. రేపు 100 వస్తున్నాయి. రేపు వంద బయట పడితే.. ఆతరువాత రోజు మరో 50 బయట పడుతున్నాయి. అదే సమయంలో పరీక్షలు చేయాల్సిన శాంపిల్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. అంత సామర్ధ్యం కొన్ని జిల్లాలలో కనిపించటం లేదు. దీంతో వేలాది శాంపిల్స్ ల్యాబ్‍లలో పెరిగిపోతున్నాయి. వారం రోజులకు కూడా ఫలితాలు రావటం లేదు. కరోనా పాజిటివ్‍ వ్యక్తులు కోలుకుని ఇళ్లకు చేరుకుంటున్నప్పటికీ.. వారి కాంటాక్టస్ మాత్రం ఫలితాలు రాక క్వారంటైన్‍ కేంద్రాలలో ఉండిపోవాల్సి వస్తుంది. కొన్ని వేలకు పైగా శాంపిల్స్ ఉన్నాయి. హోం క్వారంటైన్‍లో ఉన్న వారి సంఖ్య కూడా వేలల్లో ఉంది.

వీరందరికీ కరోనా పరీక్ష కోసం శాంపిల్‍ తీశారు. ఇప్పటి వరకు సగం ఫలితాలు వెల్లడించారు. మిగతా ఫలితాలు త్వరలో వెల్లడిస్తామంటున్నారు. జిల్లాలో ట్రునాట్‍, ఆర్టీపిసీఆర్‍ ల్యాబ్‍ ద్వారా కొందరు శాంపిల్స్ను పరీక్షిస్తున్నారు. గత 10 రోజుల నుండి కేసులు పెరుగుతుండటంతో అనుమానితులు సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. దీంతో శాంపిల్స్ సేకరణ ఎక్కువయిందే తప్ప ఆ స్థాయిలో పరీక్షలు జరగటం లేదని విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ల ఆదేశాలతో శాంపిల్స్ తీస్తున్నారని.. ఫలితాల వివరాలను కలెక్టర్లకే పంపుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. పలు జిల్లాలలో కరోనా పరీక్షల సామర్ధ్యాన్ని మరింత పెంచాలని నిపుణులు డిమాండ్‍ చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒకరికి పాజిటివ్‍ వస్తే ఆ కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్‍కు పంపుతున్నారు.

పాజిటివ్‍ వచ్చిన వ్యక్తులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే.. నెగటివ్‍ ఫలితాలు వస్తాయి. కానీ వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన ఫలితాలు మాత్రం బయటకు రావటం లేదు. మొదట పాజటివ్‍ వచ్చి తరువాత నెగటివ్‍ వచ్చిన వ్యక్తులు ఇళ్లకు వెళుతున్నారే తప్ప వారి కుటుంబ సభ్యులు మాత్రం క్వారంటైన్‍లో ఉంటున్నారు. అత్యవసర శస్త్ర చికిత్సలు చేయించుకుందామని ప్రైవేటు ఆసుపత్రికి వెళితే.. ముందు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోమని డాక్టర్లు చెబుతున్నారు. రాబోయే రోజులలో అనేక నగరాలు, పట్టణాలలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కరోనా పరీక్షల సామర్ధ్యం పెంచకపోతే ఆ తరువాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *