Mon. Aug 10th, 2020

ఆర్టీసి ఎండీ బదిలీ వెనుక..!

madireddy prathap

madireddy prathap

కొన్ని నెలల కిందట ఏపిఎస్‍ఆర్టీసి ఎండీగా నియమితులైన సీనియర్‍ ఐపిఎస్‍ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‍ను బదిలీ చేసి ఆర్టీసి ఎండీగా రవాణా, రోడ్ల భవనాల శాఖాదిపతిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న టి.కృష్ణబాబుకు ఆర్టీసి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పజెబుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఉత్తర్వులు జారీ చేశారు. మాదిరెడ్డి ప్రతాప్‍ను బదిలీ చేయటం వెనుక ఏమేమి జరిగిందనే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రతాప్‍ ఎవరికీ చిక్కరు.. దొరకరు అనిపేరుంది. రవాణా మంత్రి పేర్ని నానిని ప్రతాప్‍ పట్టించుకోరని కూడా ప్రచారం ఉంది.. ఇంకెన్ని కారణాలు ఉన్నాయనే విషయం పక్కన పెడితే… గతంలో రాజశేఖర్‍రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో మాదిరెడ్డి ప్రతాప్‍ నియమితులయ్యారు. అప్పటి నుండి సిఎం జగన్‍తో ఆయనకు పరిచయం ఉంది. ఆ పరిచయంతోనే.. మాదిరెడ్డికి ఆర్టీసి ఎండీ పదవి జగన్‍ ఇచ్చారనే విషయం జగమెరిగిన సత్యం. విధాన నిర్ణయాలు తీసుకునే ముందు.. ఉన్నతాధికారులతో, మంత్రితో చర్చించాల్సిన ప్రతాప్‍ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయటం వివాదస్పదం అవటంతో జగన్‍ ఆగ్రహానికి గురయ్యారు.

అంతే కాకుండా.. ఆర్టీసి అధికారులను ఆయన పట్టించుకోవటం లేదని సొంతంగా ఒక అధికార టీంను ఏర్పరుచుకున్నారని.. వారిలో ఎక్కువ మంది బయటి వారే అని అక్కడ పనిచేసే ఉద్యోగులు చెబుతున్నారు. రవాణ శాఖకు మంత్రితో పాటు శాఖాదిపతికూడా ఉంటారు. వారిని అప్పుడప్పుడు కలవాలి. విధానమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ మాదిరెడ్డి ప్రతాప్‍ ఈ విషయంలో అవేమి పట్టించుకోకుండా.. సొంతంగా వివాదాస్పద నిర్ణయాలు త్ణీసుకుని అప్రతిష్ట పాలయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాలతో సంస్థకు భారీ నష్టం జరిగిందని.. ఎవరో ఆధారాలతో ఫిర్యాదు చేశారట. అందుకే హఠాత్తుగా శుక్రవారం నాడు ఆర్టీసి ఎండీ ప్రతాప్‍ను బదిలీ చేస్తూ.. సంస్థకు ఎండీగా అదనపు బాధ్యతలు ఎంటి.కృష్ణబాబుకు అప్పజెప్పారు. గత నాలుగు రోజుల కిందట. సిఎం కొందరు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారట. ఆ విషయం పడలేదట. కొందరికి మాత్రమే మాదిరెడ్డి ప్రతాప్‍ బదిలీ విషయం తెలుసు. వారు కూడా ఈ బదిలీ విషయంపై ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏదిఏమైనా ఆర్టీసి ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‍ను బాధ్యతల నుండి తప్పిస్తారని.. ఆ సంస్థ అధికారులు ఎవరూ ఊహించలేదు. శుక్రవారం నాడు బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో మెజార్టీ అధికారులు ఊపిరి పీల్చుకుని ఉంటారని సంస్థ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *