Sat. Oct 24th, 2020

జగన్‍కు పుల్లారావు భయపడుతున్నారా..?

ys.jgan, prathipati pullarao

ys.jgan, prathipati pullarao

గుంటూరు జిల్లాలో ఐదేళ్లు మంత్రి పదవి నిర్వహించి.. ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి.. హైదరాబాద్‍ నగరంలోనే ఎక్కువగా కాలం గడుపుతున్న మాజీ మంత్రి పుల్లారావు.. అప్పుడప్పుడు గుంటూరు వచ్చి.. మొక్కుబడిగా పత్రికా సమావేశాలు నిర్వహించి తిరిగి వెళుతున్నారట. ఎక్కడ సిఎం దృష్టి తనపై పడుతుందో అన్న అనుమానంతో మాజీ మంత్రిపుల్లారావు కొట్టుమిట్టాడుతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు పుల్లారావు తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికే.. ఇంటిలిజెన్స్ శాఖ ఒక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేసినట్లు అధికార వర్గాల ద్వారా బయటకు పొక్కింది.. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పుల్లారావు హైదరాబాదు నగరానికే ఎక్కువగా పరిమితం అవుతూ.. తనపై జగన్‍ దృష్టి పడకుండా ఉండేందుకు.. అధికార పార్టీ నాయకులు మధ్యత్వంతో అన్నీ చక్కపెట్టుకోవాలని మాజీ మంత్రి పుల్లారావు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు పనిచేస్తాయో వేచి చూడాల్సిందే.

పుల్లారావుకు మంత్రి పదవి ఇచ్చి తప్పుచేశాను. ఆయన తన వ్యాపారాలు, అభివృద్ది చూసుకున్నారే తప్ప పార్టీ అభివృద్దికి తోడ్పడలేదు. జడ్పీ ఛైర్మన్‍ నియామకంలో కూడా తనను తప్పుదోవ పట్టించారని చంద్రబాబు గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో అన్నట్లు బయటకు పొక్కింది. మరో విషయం ఏమిటంటే.. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు అనే విషయం మాజీ మంత్రి పుల్లారావుకు వర్తిస్తుంది. ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే రజనీ.. పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు టిడిపిలో చేరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్‍పై తీవ్ర, ఘోర విమర్శలు, ఆరోపణలు చేయటం కూడా జరిగింది. ఇంతలో ఏమి జరిగిందో కానీ.. ఆమె జగన్‍ పార్టీలో చేరిపోయారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా బిసి కోటాలో మంత్రి పదవి పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు తన మద్దతుతో పార్టీలో చేరిన రజనీపైనే ఓడిపోవటంతో పుల్లారావు అప్రతిష్ట పాలు అయ్యారు. తాజాగా సిఎం జగన్‍ను చూసి పుల్లారావు భయపడుతున్నారని… అందుకే ఎక్కువ సమయం హైదరాబాదులో గడుపుతూ అడపా.. దడపా.. గుంటూరు వచ్చి పోతున్నారని.. సిఎం జగన్‍ దృష్టి తనపై పడకుండా… తెర చాటున అన్నీ చక్కపెట్టుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *