Tue. Sep 22nd, 2020

బదిలీ చేయకుంటే.. శెలవుపై వెళతానంటున్న కలెక్టర్‍..?

nellore collector

nellore collector

తనను బదిలీ చేయమని నెల్లూరు జిల్లా కలెక్టర్‍ శేషగిరిబాబు ముఖ్య అధికారులను కలిసి విన్నవించుకున్నా.. ఫలితం కనిపించకపోవటంతో.. దీర్ఘకాలిక శెలవుపై వెళ్లేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన శెలవుపై వెళ్లనక్కర్లేదు. జులై 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల పధకం ముగిశాక రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కలెక్టర్లను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఆ బదిలీలలో శేషగిరిబాబు పేరు కూడా ఉంటుందని అధికార వర్గాల సమాచారం. జిల్లాలో ఇమడలేకపోతున్నానని.. సమర్ధవంతంగా పనిచేసినప్పటికీ.. సంతృప్తి కలిగించటం లేదని కలెక్టర్‍ శేషగిరి తన సన్నిహితులు వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

జిల్లాలోని రాజకీయ పరిస్థితులతో విసుగు చెందిన శేషగిరి తాను ఎంత త్వరగా ఆ జిల్లా ను వదిలిపోతే అంత సంతృప్తి కలుగవచ్చునని భావిస్తున్నారట.కలెక్టర్‍ బాధ్యతలు నిర్వహిస్తూ జూన్‍ మాసానికి ఏడాది పూర్తి చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల వద్ద సమన్వయం లేకపోవటం.. తనపై పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలకు దిగటంతో కలెక్టర్‍ శేషగిరి రావు కలత చెందారట. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఆయనకు కత్తి మీద సాములా పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఏదో రకంగా బాధ్యలు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. అటు గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభంలో ఇటు కరోనా ఎదుర్కొనే విషయంలో కలెక్టర్‍ శేషగిరిరావు సమర్ధవంతంగా పనిచేశారని.. అధికార పార్టీ నేతలే అనేక సందర్భాలలో ప్రశంసించారు. ఆరు నెలల నుండే ఆయన బదిలీ కోరుకున్నప్పటికీ కరోనా విపత్కర సమయంలో ఆయనను ప్రభుత్వం బదిలీ చేయలేదు.

ఆయనను మళ్లీ ఏదైనా జిల్లాకు మళ్లీ కలెక్టర్‍గా నియమించే అవకాశాలున్నాయని బయటకు పొక్కింది. నెల్లూరు జిల్లాలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా అధికార పార్టీ నేతలతో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఈ ఇద్దరు మంత్రులలో ఒక మంత్రితో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోక పోయినా.. మరో మంత్రి వలన అనేక సందర్భాలలో ఇబ్బందులు పడ్డారట. ఏదో విధంగా సంవత్సర కాలం పూర్తి చేశాను. ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేను. ఇప్పటికైనా నన్ను విముక్తుడిని చేయండి. అది సాధ్యపడకపోతే దీర్ఘకాలిక శెలవుపై వెళ్లేందుకు సిద్దమని కలెక్టర్‍ సిఎంవో అధికారులతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *