Thu. Nov 26th, 2020

టిడిపి నేతలపై పరువు నష్టం కేసు వేయబోతున్న బాలినేని..?

balineni-srinivas-reddy

balineni-srinivas-reddy

తమిళనాడులో పట్టుబడ్డ ఒంగోలు వ్యాపారికి చెందిన కోట్ల డబ్బు విషయంలో తనకు సంబందం లేకపోయినా.. టిడిపి నేతలు విమర్శలు చేయటం, పలు టివి ఛానెళ్లు ప్రచారం చేయటంపై పరువు నష్టం దావాను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేయబోతున్నట్లు తెలిసింది. నిజా నిజాలు ఏమిటన్న విషయాలను తెలుసుకోకుండా.. తనపై అతస్య ప్రచారాలు, విమర్శలు చేశారని మంత్రి బాలినేని ముఖ్యమంత్రి జగన్‍ దృష్టికి తీసుకెళ్లటంతో ఈ విషయాన్ని జగన్‍ సీరియస్‍గా తీసుకోలేదు. ఆ విషయానికి ఆయన అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇదే విషయంపై సిఎం జగన్‍తో మంత్రి స్వయంగా మాట్లాడారని.. దానికి సిఎం స్పందిస్తూ.. మీ పని మీరు చేసుకోండి.. ఆ విషయాలను పట్టించుకోవద్దు.. అని తేలికగా తీసిపారేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కానీ మంత్రి బాలినేని ఈ విషయంలో తనపై చేసిన ఆరోపణలను, విమర్శలను తేలికగా తీసుకోకూడదనే ఉద్దేశంతో పరువు నష్టం కేసు వేసేందుకు కొంతమంది లాయర్లను సంప్రదించినట్లు తెలిసింది. ఆ కారుపై మంత్రి పేరుతో స్టిక్కరు ఉందని.. అదే కారులో తన కుమారుడు కూడా ఉన్నాడని.. అలాగే నగదును విదేశాలకు తరలించేందుకు ప్రయత్నం చేశారంటూ.. తమిళనాడుకు చెందిన ఒక టివి ఛానెల్‍ ప్రచారం చేసింది. అదే విధంగా రాష్ట్రానికి చెందిన ఒక టివి ఛానెల్‍, తెలుగు దేశం నాయకులు నారా లోకేష్‍, బొండా ఉమా, దామచర్ల జనార్దన్‍పై పరువు నష్టం దాఖలు చేసేందుకు మంత్రి బాలినేని రంగం సిద్దం చేసుకుంటున్నారట. ఆధారాలు లేని ఆరోపణలు, అసత్యాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందేందుకు తెలుగు దేశం చేసిన ప్రయత్నాలకు గండి కొట్టాలంటే.. వారందరిపై పరువు నష్టం కేసు దాఖలు చేయాలనే ఉద్దేశంతో బాలినేని ఉన్నట్లు తెలిసింది.

ప్రస్తుత మంత్రులలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే సాద్వికుడు అని.. అన్ని కులాలకు చెందిన వారు ముఖ్యంగా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు కూడా మంత్రిని అభిమానిస్తున్నారని.. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మంత్రిపై మీడియాలో కధనాలు ప్రచురితమయ్యాయని నమ్మి గుడ్డిగా ఆదారాలు, సాక్ష్యాలు లేకుండా విమర్శలు చేస్తే.. అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని.. నాయకులు అందరూ తెలుసుకునే విధంగా మంత్రి పరువు నష్టం దాఖలు చేయటం శుభపరిణామమే అని రాజకీయ విశ్లేషకులతో పాటు కొంత మంది టిడిపి నేతలు కూడా తెర వెనుక చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *