Sat. Oct 24th, 2020

సిఎం ఆదేశాలను పట్టించుకోని అధికారులు

ys.jagan, officer

ys.jagan, officer

అవినీతికి పాల్పడక0డి… నిజాయితీగా, పారదర్శకంగా వ్యవహరించ0డి.. రాజకీయ అధికార ఒత్తిళ్లకు తలొగ్గవద్దు. బెదిరింపులకు భయపడవద్దు.. నిబందనల ప్రకారమే నిర్ణయాలు తీసుకోండి. మా ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది. మీరు కూడా నిజాయితీగా నిర్ణయాలు తీసుకుని ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సిఎం చెబుతూనే ఉన్నారు. అధికారులు వింటూనే ఉన్నారు. చివరకు రాజకీయ, అధికార ఒత్తిళ్లకు తలొగ్గుతూ నిధులుదుర్వినియోగం జరుగుతున్నా పట్టించుకోవటం లేదు. విచారణ చేయటం లేదు. వివిధ జిల్లాలలోని నగరాలలో, పట్టణాలలో ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో రాజకీయ ఒత్తిళ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సిఎం ఒక్కరే నిజాయితీగా ఉన్నా.. అక్రమార్కులకు, అవినీతిపరులకు అమాత్యులు, అధికార పార్టీ నాయకులు కొందరు కొమ్ము కాస్తుంటే.. ఏవిధంగా నిజాయితీగా, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ జోక్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేద్దామంటే.. ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఏదో విధంగా అడ్డు తగులుతూనే ఉంటారు. రాజకీయ ఒత్తిళ్లకు తట్టుకోలేక అధికారులు, ఇంజనీర్లు కొంతమంది దీర్ఘకాలిక శెలవుపై వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. మాపనులు చక్కపెడితే.. సీటులో కూర్చోండి.. లేదా శెలవుపై వెళ్లండి.. పనులు చక్కపెట్టకుంటే.. ఖబడ్దార్‍ అని అధికారులను పలువురు హెచ్చరిస్తున్నారట. భయపెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యతగల విపక్షాల నేతలు అలాంటి సంఘటనలపై దృష్టి సారించకుండా.. రాజకీయ విమర్శలకే ప్రాధాన్యతిస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాలు ఒక విధంగా ఉంటున్నాయి. మంత్రులు, అధికార పార్టీ నాయకులు ఆ ఆదేశాలను పెడ చెవిన పెడుతున్నారని, అధికారులపై ఒత్తిడి తెస్తూ.. భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కనీసం విపక్షాల నేతలు అయినా.. ఇలాంటి సంఘటనలపై పెదవి విప్పితే అధికార పార్టీ నేతలకు, అమాత్యులకు భయాలు పెరుగుతాయి. బెదిరింపులకు పాల్పడరు. దూకుడుగా ముందుకు వెళ్లకుండా తగ్గుతారు. కానీ అలాంటి విపక్షాల నేతలు వివిధ జిల్లాలలో ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. మెజార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అన్ని తెలిసినా చోద్యం చూస్తూ కాలం గడుపుతున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *