Wed. Oct 21st, 2020

ఆగని అక్రమ మద్యం రవాణా..!

liquor

liquor

వివిధ జిల్లాలలో అక్రమ మద్య నియంత్రణ పోలీసు శాఖకు, స్పెషల్‍ ఎన్‍ఫోర్స్మెంట్‍ బ్యూరో (ఎస్‍ఈబి)కి సవాల్‍గా మారింది. గతంలో ముఠా కక్షలను అణిచివేశాం. తీవ్రవాదులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. కానీ అక్రమ మద్య రవాణా పెద్ద సమస్యగా మారిందని అధికారులు అంటున్నారు. అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు దాడులు చేసినా.. తనిఖీలు చేసినా.. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్య రవాణ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. సారాను కూడా తయారు చేస్తున్నారు. దానిని అధికారులు అదుపు చేయలేపోతున్నారు. అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ దొరికేది దొరుకుతూనే ఉంది. మద్యం రవాణ అవుతూనే ఉంది. అక్రమార్కులు, మందుబాబులు ఏ మాత్రం భయడపకుండా ఏదో విధంగా అక్రమ మద్య రవాణ బరి తెగిస్తున్నారు.

రాష్ట్ర సరిహద్దులలో ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలను తనిఖీ చేస్తే.. అక్రమ మద్యం దొరుకుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం దగ్గరగా ఉన్న నేపధ్యంలో కొన్ని జిల్లాలు రాష్ట్ర సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో మద్యాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్నారు. ఈ సమస్యఅంతా రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరల వలనే. ఈ అక్రమ మద్యానికి, నాటు సారా తయారికి రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. మద్యం అలవాట్లు దూరం చేయాలన్న ఉద్దేశంతో మద్యం ధరలను పెంచితే.. ఆ అలవాటును ప్రజలు మానతారు అని పాలకులు భావించారు. ఈ అక్రమ మద్య రవాణాను ఏమీ చేయలేని పరిస్థితులలలో అధికారులు కొట్టు మిట్టాడుతున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని మద్యం ధరలతో రాష్ట్ర మద్యం ధరలు పోలిస్తే.. భారీ వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలో కొనే ఒక సీసా డబ్బుతో.. తెలంగాణ రాష్ట్రంలో రెండు సీసాలు కొనుగోలు చేయవచ్చు అంటున్నారు మందు బాబులు. మద్యం దుకాణాలలో పాత బ్రాండులు కనిపించటం లేదు.

కొత్త కొత్త బ్రాండులు తాగేందుకు మందుబాబులు విముక్తి చూపుతున్నారు. మద్య నియంత్రణకు ఏర్పాటు చేసిన ఏస్‍ఈబి అధికారులు దాడులు చేస్తున్నారు. అక్రమ మద్యం పట్టుబడుతూనే ఉంది. అయినా సరే మన రాష్ట్రానికి సరిహద్దులలో ఉన్న రాష్ట్రాల నుండి అక్రమ మద్యం సరఫరా అవుతూనే ఉంది. ఎన్నెన్ని దాడులు చేసినా… ఎంత అక్రమ మద్యాన్ని పట్టుకున్నా.. సముద్రంలో నీరు ఏ విధంగా తగ్గిపోదో.. మద్య అక్రమాలపై ఎన్ని దాడులు చేసినా.. ఎంత పట్టుకున్నా.. అంతకు రెట్టింపు అక్రమ మద్య రవాణా జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో పెంచిన మద్యం ధరలు, ఇది వరకు మందుబాబులు తాగే బ్రాండులు లభించకపోవటంతో.. కొత్త బ్రాండులు తాగేందుకు మందు బాబులు ఆసక్తి చూపటం లేదు. దీంతో ఈ అక్రమ రవాణాను అక్రమార్కులు చేస్తున్నారు. వీరిలో కొందరికి రాజకీయ అండదండలున్నాయి. అయినా ఆధారాలుండవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *