Tue. Sep 22nd, 2020

మళ్లీ లాక్‍డౌన్‍ అమలు చేయకుంటే..?

ap lockdown, jagan

ap lockdown, jagan

ప్రజలు భౌతిక దూరం పాటించటం లేదు. దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. మాస్కులు కూడా లేకుండా మద్యం దుకాణాల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. ఎవరూ జాగ్రత్తలు తీసుకోవటం లేదు. పత్రికలు కధనాలు ప్రచురించినా.. టివిలు కధనాలు ప్రసారం చేసినా.. చెవిటి వాని ముందు శంఖం ఊదిన చందంగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కనీసం 15 రోజుల నుండి 30 రోజుల వరకు జనం రాక పోకలను కట్టడి చేయండి. ఇంటికే పరిమితం చేయండి. బయట నుండి వచ్చే వారిని నిలువరించండి. ఇవన్నీ అమలు చేయాలంటే.. మళ్లీ లాక్‍డౌన్‍ విధించాల్సిందే. లేకుంటే.. అసలుకే ఎసరువస్తుందని వివిధ జిల్లాలలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా ప్రజలతో స్వయంగా మాట్లాడారు. చాలా మంది ప్రజలు లాక్‍డౌన్‍ వైపే మొగ్గు చూపారు. ముఖ్యంగా రాకపోకలను కఠినంగా నియంత్రించాలని కోరారు. మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకోవటం లేదు. వారిలో చాలా మంది ఇళ్లలో ఉంటున్నారా.. మరో ప్రదేశానికి వెళ్లారా అనే విషయం కూడా బయట పడటం లేదు. మార్కెట్లలో, రైతు బజార్లలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేవారిలో ఎక్కువ మంది భౌతిక దూరం పాటించటం లేదు. మద్యం దుకాణాల వద్ద జనం గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. కనీసం మాస్కులు కూడా ధరించటం లేదు. స్థానిక అధికారులు ఎవరూ పట్టించుకోవటం లేదు. మధ్యాహ్నం రెండు గంటలకే దుకాణాలను మూసి వేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి. కరోనా పరీక్షలు మరింత వేగం పెంచాలి. ఫలితాలు కూడా అదే రోజు బయట పెట్టాలని ప్రజలు కోరుతున్న నేపధ్యంలో ఈ విషయాలన్నీ పాలకుల దృష్టికి జిల్లాల అధికారులు తీసుకువెళ్లారు. అందరూ ముక్త కంఠంతో కోరేది ఒకటే.. మళ్లీ లాక్‍డౌన్‍ అమలు చేయండి. మెజార్టీ ప్రజలను ఇళ్లకే పరిమితం చేయండి. ఉదయం ఏడు నుండి 10 వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వండి. ఈ పద్దతులు పాటించకుంటే.. కరోనా వ్యాది ఈరోజు వందల సంఖ్యలో బయట పడుతుంది. మరి కొన్ని రోజులు గడిస్తే.. రోజుకు వేల కేసుల బయట పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *