Thu. Nov 26th, 2020

రజనీకి మంత్రి పదవి ఇవ్వద్దంటున్న ఎమ్మెల్యేలు..?

vidadala-rajini

vidadala-rajini

బిసి సామాజికవర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపికయిన నేపధ్యంలో… త్వరలో తన మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. అదే సామాజికవర్గానికి చెందిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ జగన్‍ పార్టీ ముఖ్యనేతలను కలిసి కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు పార్టీలో చేరిన అవంతి శ్రీనివాస్‍ను ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి ఇవ్వలేదా.. తాను ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచానని..మా ఎమ్మెల్యే రజనీ కుమారి బిసి సామాజికవర్గానికి చెందిన వారని… ఆమె భర్త కాపు సామాజికవర్గానికి చెందిన వారని.. మంత్రి పదవి ఇస్తే.. బిసి సామాజికవర్గానికి, కాపు సామాజికవర్గానికి మంత్రి పదవి విషయంలో సమన్యాయం చేసినట్లుఅవుతుందని ఎమ్మెల్యే రజనీ అనుచరులు అంటున్నారు.

ఇప్పటికే గుంటూరు జిల్లాలో దళిత సామాజికవర్గానికి చెందిన మహిళ సుచరితకు మంత్రి పదవితో పాటు అత్యంత ప్రాధాన్యత గల హోం శాఖను కేటాయించటంతో.. మళ్లీ మరో మహిళకు మంత్రి పదవిని జగన్‍ ఇస్తారా.. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవి ఇస్తే.. పార్టీ ప్రతిష్ట ప్రస్తుతం కన్నా రెట్టింపు అవుతుందని… ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. మంత్రి సుచరిత విపక్షాల నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు ధీటుగా, సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతున్నారని.. సంవత్సరం కాలంలో ఎమ్మెల్యేగానే మాజీ మంత్రి పుల్లారావును మూడు చెరువుల నీరు తాగిస్తున్న రజనీకి మంత్రి పదవి ఇస్తే.. జిల్లాలో తెలుగుదేశం నాయకులను సమర్ధవంతంగా ఎదుర్కొంటారని.. రజనీ అనుచరులు చెబుతున్నప్పటికీ.. గుంటూరు జిల్లాలో ఇప్పటికే దళిత మహిళకు మంత్రి పదవి ఇచ్చి తప్పు చేశారని మరో మహిళకు మంత్రి పదవిని జగన్‍ ఇవ్వరని.. ఆయన వ్యవహారి శైలి తెలిసిన గుంటూరుకు చెందిన పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మంత్రి పదవిని రజనీ కోరుకుంటూ ఆ పదవి వస్తుందని.. ఆశపడుతున్నారని.. కొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు మీడియా వర్గాలలో వ్యంగ్యంగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే రజనీకు మంత్రి ఇవ్వకూడదని.. మాలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా.. ఒకే ఇవ్వకపోయినా.. ఓకే రజనీకి మంత్రి పదవి ఇవ్వద్దని జగన్‍పై ఎమ్మెలు ఒత్తిడి తెచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *