Tue. Sep 22nd, 2020

భక్తుల ద్వారా కరోనా వ్యాప్తి లేదు..!

ttd

ttd

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు… కరోనా వైరస్‍ వ్యాప్తికి సంబందం లేదని చిత్తూరు జిల్లా కలెక్టర్‍ భరత్‍ గుప్తా తేల్చారు. కానీ ఇప్పటి వరకు ఎనిమిది మందికి పాజిటివ్‍ కేసులు వచ్చాయని కలెక్టర్‍గారు కూడా అంగీకరించారు. అసలు విషయం ఏమిటంటే… తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. రోజుకు పది నుండి 12వేల మంది భక్తులు వస్తున్నారు. అదే విధంగా విఐపిలు, వారి కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. దీని వలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కదా.. అని కలెక్టర్‍ను ప్రశ్నించగా.. తిరుమలకు వచ్చే ప్రతిభక్తుడి నుండి శాంపిల్స్ సేకరణ సాధ్యం కాదని.. అందుకే రోజుకు వంద మంది నుండి రాండమ్‍ శాంపిల్స్ను సేకరిస్తున్నామన్నారు.

ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి సేకరిస్తున్నామని, గత 20 రోజుల నుండి ఏ ఒక్క కేసు బయట పడలేదని కలెక్టర్‍ చెబుతున్నారు. దేవస్థానంలో పనిచేసే వైద్య, విజిలెన్స్ సిబ్బందితో పాటు ఒక అర్చకుడికి, మరో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‍ వచ్చినట్లు కలెక్టర్‍ వెల్లడించారు. ఈవో వినతి మేరకు టిటిడి ఉద్యోగులలో రోజుకు వంద మంది నుండి శాంపిల్స్ సేకరిస్తున్నామని.. జిల్లాలో కరోనా వ్యాప్తి రేటు 2 శాతంగా ఉందని.. ప్రతి వందమందిలో ఇద్దరికి బయట పడుతుందని కలెక్టర్‍ చెబుతున్నారు. 400 మంది టిటిడి ఉద్యోగుల నుండి శాంపిల్స్ సేకరించారు. అందులో రెండు శాతం ఎనిమిది నుండి 10 కేసులు ఉంటాయని అంచనా వేశామన్నారు. దీనిని బట్టి తిరుమలకు వచ్చే భక్తుల వలన కరోనా వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారంలోవాస్తవం లేదు.

దీనిని బట్టి భక్తుల వలన కరోనా వచ్చే ప్రమాదం లేదని కలెక్టర్‍ స్పష్టం చేశారు. తిరుపతిలో ఉంటూ తిరుమలకు వచ్చే ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నప్పటికీ.. ఇంత వరకు ఆ పక్రియ ప్రారంభం కాలేదు. టిటిడి ఉద్యోగులలో కొందరికి కరోనా వచ్చినంత మాత్రాన ఆందోళన చెందక్కర్లేదు. తిరుమలకు వచ్చే భక్తులలో ఏ ఒక్కరికి కరోనా బయట పడలేదని అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి కరోనా వ్యాప్తి చెందటానికి.. తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి సంబందం లేదు. ఒకవేళదీనిపై ఎవరైనా ప్రచారం చేసినా.. సోషల్‍ మీడియాలో పోస్టులు చేసినా.. నమ్మవద్దని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *