Sat. Oct 24th, 2020

శెలవుపై నెల్లూరు కలెక్టర్‍

nellore collector

nellore collector

నెల్లూరు జిల్లా కలెక్టర్‍ ఎంవి.శేషగిరి బాబు తనను ఎప్పటి నుండో బదిలీ చేయవల్సిందిగా… ప్రభుత్వాన్ని కో రుతున్నప్పటికీ.. ఆయన కోరికను పాలకులు తీర్చకోవటంతో.. దీర్ఘకాలిక శెలవుపై వెళతారని ప్రచారం జరిగింది. ఇదే విషయంపై జెమినిన్యూస్‍ఆన్‍లైన్‍ కూడా కధనాన్ని ప్రచురించిన విషయం విధితమే. తాజాగా శేషగిరి బాబు పది రోజుల శెలవుపై ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా.. మంజూరు చేస్తూ.. శుక్రవారం దరఖాస్తులు వెలువడ్డాయి. ఈ పదిరోజులలో తనను బదిలీ చేయటం ఖాయమని.. బదిలీ చేయకుంటే.. శెలవును మరింత పొడిగిస్తానని కొందరికి చెప్పినట్లుబయటకు పొక్కింది. బదిలీ చేయకుంటే.. జిల్లాకు ఆయన వస్తారా..రారా.. అనే విషయం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపధ్యంలో బదిలీ కోసం ఆయనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. జులై 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి అయిన తరువాత తనను బదిలీ చేస్తారని ఆయన భావించారు. కానీ ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయటంతో శేషగిరి బాబు పది రోజుల శెలవుపై వెళ్లటం ఆసక్తిగా మారింది.ఈ వారం పదిరోజులలో ఐఎఎస్‍ అధికారులు బదిలీలు జరుగుతాయి. అప్పుడు తన పేరుకూడా ఆ జాబితాలో ఉంటుందని శేషగిరి బాబు నమ్ముతున్నారు. ఆ బదిలీలల జాబితాలో ఆయన పేరు ఉంటే.. జిల్లాకు రారు. లేకుంటే.. శెలవును మరింత పొడిగిస్తారా..? మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారా.. వేచి చూడాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *