Wed. Oct 21st, 2020

నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి

collector bhasker

collector bhasker

ప్రభుత్వ పాఠశాలలను  ప్రైవేట్‍ పాఠశాలలకు ధీటుగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న నాడు-నేడు పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‍ నారాయణ భరత్‍ గుప్తా పేర్కొన్నారు.. బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాల సముద్రం మండలంలో జరుగుతున్న నాడు-నేడు పనులను కలెక్టర్‍ పరిశీలిం చారు అలాగే ఉపాధి హామీ పనుల తో పాటు పాఠశాల అభివ•ద్ధికి చేపడుతున్న మరమ్మతు పనులు చెత్త నుండి సంపద తయారుచేసే కేంద్రాలను పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‍ డా.నారాయణ భరత్‍ గుప్త  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‍ పాఠశాలకు ఏ మాత్రం తీసిపోకుండా అన్ని సౌకర్యాలు కల్పించి, సమూల మార్పులు చేయిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణము, మేజర్‍,మైనర్‍  రిపైర్లు, పెయింటింగ్స్ ఆర్‍ ఓ వాటర్‍ ఏర్పాటు, ఫ్యాన్లు ఏర్పాటు వంటివి చేస్తున్నారన్నారు. పనుల్లో నాణ్యత తగ్గకుండా జాగ్రత్త గా పనులు చేయాల ని అధికారులను ఆదేశించా రు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశా ల మేరకు పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు పూర్తి స్థాయిలో నిర్దేశించిన పనులను అధికారులు పూర్తి చేయాలని నాణ్యత లోపంతో పాటు పనులలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులను జిల్లా కలెక్టర్‍ హెచ్చరించారు..ఈ పర్యటన లో సమగ్ర శిక్ష అదనపు కో ఆర్డినేటర్‍ వెంకట్రామి రెడ్డి,సంబంధింత   శాఖల అధికారులు పాల్గొన్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *