Tue. Sep 22nd, 2020

ముద్రగడ లేఖ వెనుక..!

mudragada padmanabham

mudragada padmanabham

కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాను ఉద్యమం నుండి తప్పుకోబోతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. తనను మానసికంగా క్రుంగిపోయే విధంగా మీడియా ద్వారా విమర్శలు దాడులు చేయిస్తున్నారు. ఉద్యమకాలంలో నేను వసూలు చేసిన నిధులు కానీ, పారిశ్రామికవర్గాల నుండి బెదిరించిన సొమ్ములు కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‍పై కోట్లాది రూపాయలు వసూలు చేసి నన్ను నిత్యం విమర్శించే కాపు సోదరులకు పంచలేదని… నాపై దాడి చేయిస్తున్నారా అని ముద్రగడ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమం ద్వారా సొమ్ములు, పదవులు పొందాలని నేను ఏనాడు ఆశించలేదు. ఉద్యమం లోకి వచ్చిన తరువాత ఆర్దికంగా, ఆరోగ్యపరంగా, రాజకీయంగా ఎంత నష్టపోయానో అందరికీ తెలుసు. ఆ నష్టాన్ని నేను ఎప్పుడు వ్యక్తం చేయలేదని ముద్రగడ తెలిపారు. అనేక కారణాలతో ఉద్యమం నుండి తప్పుకుంటున్నాను.

ఈ ఉద్యమాన్ని ఎవరు నడిపినా.. ఎవరి ద్వారా రిజర్వేషన్‍ వచ్చినా.. అందరికన్నా ముందు సంతోషిస్తానని ముద్రగడ అన్నారు. ముద్రగడ ప్రకటనపై అభిమానులు, అనుచరులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ముద్రగడను కాపు నేతలు బుజ్జగించి ఉద్యమ నేతగా కొనసాగించేటట్టు చేస్తారా.. ఈ విషయం త్వరలో తేలే అవకాశాలున్నాయి. ఎవరో ఒకరు.. తనకు ఫోన్‍చేసి మీ కష్టం ద్వారా వచ్చే ఫలితాన్ని ఇతరులు కొట్టేశాలా ఉన్నారు. ఇతరులు ఇచ్చిన స్టేట్‍మెంట్‍కు మీరు సపోర్టు ఇవ్వమని సలహా ఇచ్చారు. అలాంటి వారితో నేను ఎందుకు నడవాలి. ఉద్యమం ప్రారంభించాక వారందరూ నా వెంటన నడిచారా..? ఆనాడు వారు నడవలేదు.నేడు నేడు నేను నడవాల్సిన అవసరంలేదు. కాపులకు రిజర్వేషన్‍ ముఖ్యం. ఎవరి ద్వారా ఆ రిజర్వేషన్‍ వచ్చినా.. మన అందరం సంతోష పడదాం. ఇదే విషయాన్నిగతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశానని ముద్రగడ వ్యక్తం చేశారు. కాపు ఉద్యమం నుండి ముద్రగడ తప్పుకోవటానికి కారణాలు ఏమిటా అని పలువురు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *