Wed. Oct 21st, 2020

మంత్రి సన్‍కు కరోనా స్ట్రోక్‍

dharmana

dharmana

మంత్రి ధర్మాన కృష్ణదాస్‍ కుమారుడికి కూడా కరోనా స్ట్రోక్‍ తప్పలేదు. తండ్రి తరపున కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించటంతో.. కరోనా పరీక్ష చేయించకున్నారు. వెంటనే పాజిటివ్‍గా నిర్దారణ అయింది. కుమారుడికి కరోనా రావటంతో మంత్రి కూడా హోం క్వారంటైన్‍కు వెళ్లిపోయారు. బుధవారం నాడు శాసనసభాపతి తమ్మినేని సీతారం నియోజకవర్గమైన ఆమదాలవలసలో జరిగిన దివంగత నేత వైఎస్సార్‍ జయంతి కార్యక్రమంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‍, శాసనసభాపతి తమ్మినేని, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. దీంతో తమ్మినేని కూడా హోం క్వారంటైన్‍కు వెళ్లిపోయారు. 15 రోజుల పాటు క్యాంపు కార్యాలయానికి సందర్శకులు రావద్దని మంత్రి ధర్మాన, తమ్మినేని సూచించారు. మంత్రి కుమారుడికి కరోనా పాజిటివ్‍ బయట పడటంతో ఆయనతో తిరిగిన కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగులు భయాందోళనకు లోనవుతున్నారు. చివరకు మంత్రి, శాసనసభాపతులు తమ క్యాంపు కార్యాలయాలను పూర్తిగా మూసి వేశారు. మంత్రి కుమారుడికి కరోనా బయట పడటంతో అటు మంత్రి ధర్మాన, శాసనసభాపతి తమ్మినేని సీతారం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అధికారులు, కార్యకర్తలకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందేమో అని వారి కుటుంబ సభ్యులు ఆందోళనతో కనిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *