Sat. Oct 24th, 2020

కేంద్ర ఆర్డినెన్స్తో మార్కెట్‍ కమిటీల మనుగడకు ముప్పు..!

market committee

market committee

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వన్‍ మార్కెట్‍.. వన్‍ సేషన్‍ ఆర్డినెన్స్తో వ్యవసాయ మార్కెటింగ్‍ కమిటీలు అలంకార ప్రాయాలుగా మారబోతున్నాయి. ఈ ఆర్డినెన్స్తో తాము పండించిన పంటలను దేశంలో ఎక్కడైనా ఈ-మార్కెంటింగ్‍ విధానంతో రైతులు అమ్ముకోవచ్చు. దీంతో రైతులకు పూర్తిగా స్వేఛ్చ లభించబోతుంది. అంతే కాకుండా.. మార్కెటింగ్‍ కమిటీలకు ఇంతకు ముందు చెల్లించే సెస్‍ కూడా చెల్లించనక్కర్లేదని ఆ ఆర్డినెన్స్లో కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రైతులకు మేలు జరగటం ఖాయమని.. ఎఎంసీలు పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్కెటింగ్‍ కమిటీలకు పాల•• వర్గాలు ఉన్నా.. వారి ప్రభావం ఏమీ పనిచేయదని స్పష్టమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‍ కమిటీలకు మంగళం పాడటం తప్ప గత వైభవాన్ని తెచ్చేందుకు కానీ.. బలోపేతం చేయటానికి కానీ ప్రయత్నించే పరిస్థితులు కనిపించటం లేదు. ఎప్పుడైతే సెస్‍ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందో దాంతో మార్కెటింగ్‍ కమిటీలు ఆదాయం పెద్ద మొత్తంలో కోల్పోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గతంలో వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకు వెళ్లాలంటే.. మార్కెట్‍ కమిటీలే కీలక పాత్ర పోషించేవి. దాని ద్వారా ఈ శాఖకు వస్తున్న సెస్‍లో కొంత మార్కెట్‍ కమిటీల అభివృద్దికి, మరి కొంత మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసేవారు. అనేక జిల్లాలలో మార్కెట్‍ చెక్‍ పోస్టులు పనిచేస్తున్నాయి. ధాన్యం, బియ్యం, కొబ్బరి, అరటి, మత్స్య సంపదపై వసూలు చేస్తున్న సెస్‍ నుండి ప్రభుత్వ నిబందనల ప్రకారం రైతులు సంక్షేమం కోసం ఖర్చుచేయాలి. మిగిలిన సెస్‍ సొమ్మును ప్రభుత్వానికి జమ చేయాలి. ప్రతి సంవత్సరం మార్కెట్‍ కమిటీల ద్వారా ప్రభుత్వానికి వందల కోట్లుఆదాయం లభించేంది. తాజాగా కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ అమల్లోకి వస్తున్న నేపధ్యంలో ఆ ఆదాయానికి గండి పడటం ఖాయం. దీంతో కొన్ని మార్కెట్‍ కమీటీలు విలీనం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కొన్ని ప్రాంతాలలో చెక్‍పోస్టులు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఏఎంసిలలో పనిచేస్తున్న అవుట్‍ సోర్సింగ్‍ ఉద్యోగుల పద్దతి దారుణంగా ఉంది. ఇప్పటి వరకు సెస్‍ ద్వారా వచ్చే సొమ్ములో వారి జీత భత్యాలు చెల్లించేవారు. శాశ్వత ఉద్యోగులకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాల్సి ఉంది. చివరకు మార్కెటింగ్‍ కమిటీల పరిస్థితే ప్రశ్నార్దకంగా ఉంటే ఇక అవుట్‍ సోర్సింగ్‍ ఉద్యోగుల పరిస్థితి గందరగోళం కావట ఖాయం. ఒకటే పార్లమెంటు నియోజకవర్గంలోఉన్న మార్కెట్‍ కమిటీలు అన్నింటినీ ఒకటిగా చేసే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *