Tue. Sep 22nd, 2020

బ్లాక్‍లో మద్యం కిక్కు..!

liquor

liquor

వివిధ జిల్లాలలో కొందరు మద్యం వ్యాపారులు బరి తెగిస్తున్నా.. అధికార యంత్రాంగం వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించటం లేదని విమర్శలు వస్తున్నాయి. లాక్‍డౌన్‍నేపధ్యంలో మద్యం దుకాణాలతో పాటు బార్‍ అండ్‍ రెస్టారెంట్లనుకూడా పూర్తిగా మూసి వేసిన విషయం విధితమే. రాష్ట్రంలో మద్యపాన నియంత్రణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మద్యం మాఫియా తమ ఆదాయ వనరులుగా మార్చుకుంది. మద్యందుకాణాలను తగ్గించటం.. ప్రముఖ మద్యంబ్రాండ్లు అందుబాటులో లేకపోవటంతో అక్రమ మద్యం వ్యాపారులు పక్క రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం దిగుమతి చేసుకుని వాటిని రెట్టింపు రేట్లకు అమ్ముతూ కోట్లు గడిస్తున్నారు.

మరో విషయం ఏమిటంటే.. పలు జిల్లాల్లో విపక్షాల నేతలు కూడా ఈదందాలు చేస్తున్నట్లు బయటకు పొక్కింది. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగటం.. పక్క రాష్ట్రాలలో తక్కువ ధరలకు మద్యం అమ్మకాలు జరుగుతున్న నేపధ్యంలో.. అక్రమ మద్య వ్యాపారులకు అది వరంగా మారింది. ఒకొక్క బాటిల్‍పై ఎమ్మార్పీ కంటే రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారట. సరిహద్దు గ్రామాల నుండి యధేచ్చగా అక్రమ మద్యం ఏరులై పారుతుంది. అక్రమ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. మరో వైపు అక్రమ మద్య వ్యాపారం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఎక్సైజ్‍ శాఖలో ఎప్పుడో తిష్ట వేసిన అధికారులు, సిబ్బంది ఈ అక్రమ వ్యాపారులకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. కరోనా, లాక్‍డౌన్‍ నేపధ్యంలో కొన్ని జిల్లాలో బార్ల నుండి పెద్ద ఎత్తున మద్యం తరలించినట్లు అధికారులు దృష్టికి వచ్చింది. రాత్రి వేళల్లో యధేచ్చగా ఈ తతంగాన్ని నడుపుతున్న అధికార పార్టీ నేతల అనుచరులు కొందరు మద్యం దుకాణదారులతో కుమ్మక్కుఅయ్యారని అధికారులు తెలుసుకున్నారు.

తెలంగాణ మద్యం వ్యాపారులతో ఈ అక్రమ మద్యం వ్యాపారులు కుమ్మక్కై మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికీ అధికారులు ఎన్నో వేల కేసులు నమోదు చేశారు. ఎన్నో వేల మంది అరెస్టు అయ్యారు. లక్షలాది మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వేలాది వాహనాలను సీజ్‍ చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న కొంతమంది సూపర్‍ వైజర్లు సేల్స్ మెన్‍లతో కలిసి మద్యం మాఫియా ముఠా సభ్యులతో చేతులు కలిపి మద్యం దుకాణాలకు వచ్చే ప్రముఖ బ్రాండ్లను మాయం చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.ఇందులో అధికార పార్టీకి చెందిన వారు కొందరు ఈ తతంగం నడిపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు అక్రమ మద్యం వ్యాపారంలో భాగస్వాములైనప్పటికీ వారితో పరోక్షంగా కలిసి అక్రమ వ్యాపారం చేస్తున్న టిడిపి నేతలనే అధికార పార్టీకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ విష•యంలో వాస్తవాలు తెలుసుకుని అధికార నాయకులు భాగోతాన్ని బయట పెట్టాల్సిన విపక్షాల నేతలు ఎవరూ నోరు మెదటపటం లేదు. అక్రమ మద్యం వ్యాపారం బయట పడితే.. రాజకీయ, అదికార వేదింపులు జరుగుతాయని భయాదోళనలతో విపక్షాలు మౌనం వహిస్తున్న తీరు అధికార పార్టీకి వరంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *