Wed. Oct 21st, 2020

అంతా.. మా.. ఇష్టం..!

land

land

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం… ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా ఇస్తాం.. అధికారులు ఎలాంటి సిఫార్సులను అమలు చేయవద్దు.. బెదిరింపులకు భయపడకండి అని ముఖ్యమంత్రి జగన్‍ చెబుతూనే ఉన్నారు.. కానీ ఆయన చెప్పిన మాటలు నీటి మూటలవుతున్నాయి.. దీనికి కారుకులు ఎవరైనా జగన్‍ను అత్రిష్టపాలు చేస్తున్నా.. అసలు విషయాలు జగన్‍ దృష్టికి ఏ ఒక్కరూ తీసుకువెళ్లటం లేదని అధికారులు చెబుతున్నారు. ఉచితంగా స్థలాలు ఇవ్వాల్సింది పోయి.. వారి దగ్గర నుండి వేలకు వేలు వసూలు చేస్తున్నారని.. ఈ వసూళ్లు వెనుక అధికార పార్టీ నేతల, అమాత్యుల బంధుమిత్రులు, వారి అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.ఇళ్ల స్థలాలు వివాదాలలో అక్రమాలు ఏర్పడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో లబ్ది దారుల నుండి వీలైనంత డబ్బుల రూపంలో అధికార పార్టీ నేతల అనుచరులు నొక్కేశారని ప్రచారం జరుగుతోంది. లాడ్రి పద్దతిలో కుదిరిన చోటల్లా మ్యాజిక్‍ చేశారట. మరి కొన్ని చోట్ల సొమ్ములు బాగా ముట్ట చెప్పిన వారికి ప్రాధాన్యత కలిగిన చోట్ల స్థలాలు ఇప్పించారట. సొమ్ములు ఇవ్వని వారికి ఎక్కడో దూరంగా స్థలాలు ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. అధికారాన్ని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అమాత్యుల అనుచరులు బాగానే వినియోగించుకున్నారంటున్నారు బాధితులు.

ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. వాటిని అధికారులు చెత్త బుట్టలో వేశారట. పక్రియ ముగుస్తున్న తరుణంలో అనేక ఆరోపణలు, విమర్శలు బయట పడుతూనే ఉన్నాయి. ఇళ్ల స్థలాల కేటాయింపు దామాషా పద్దతిలో జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నా… క్షేత్ర స్థాయిలో దీనికి బిన్నంగా చోటా మోటా నేతలు రెచ్చిపోతూ.. తమకు అనుకూలమైన వారికి ప్రాధాన్యత ప్రదేశాలలో ఇళ్ల స్థలాలు ఇప్పించారట. అనేక నియోజకవర్గాలలో వసూళ్ల పర్వం బయట పడింది. మీడియా ప్రసారం చేసింది. అయినప్పటికీ… అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని బాధితులు అంటున్నారు. కలెక్టర్‍ స్థాయి నుండి మండల స్థాయి అధికారులు వరకు అధికార పెత్తనానికి తలవంచుతున్నారని.. విపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు ఖండించేందుకు కూడా అధికారులు ముందుకు రావటం లేదు. పేదలకు ఉచిత స్థలాలు కేటాయింపు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ఆరోపణల యుద్దం జరుగుతుంది.. అధికారులకు తెలిసి కొన్ని ప్రదేశాలలో.. తెలియకుండా మరి కొన్ని ప్రదేశాలలో స్థలాల వ్యవహారం మలుపులు తిరుగుతూ వచ్చింది.

అనవసర వివాదాలు తమకు ఎందుకు అన్నట్లు మెజార్టీ అధికారులు మౌనం వహిస్తున్నారు. స్థలాల సేకరణలో జిమ్మిక్కులు జరుగుతున్నాయి. స్థలాల కేటాయింపుల్లో అధికార పెత్తనం బాగా పనిచేసింది. చేయి తడిపితేనే.. దగ్గరలో ఉన్న స్థలాలు కేటాయిస్తున్నారు. అధికార పార్టీ సానుభూతిపరులకైతే రోడ్ల పక్కనే ఇస్తున్నారు. కొన్ని ఊళ్లలో స్థలాలు లేకపోయినా.. దూరంగా స్ధలాలు కొంటున్నారట. పెత్తనం ఒకరిది.. లొసుగులు మరొకరివి ఎవరెవరు ఎంతెంత వసూలు చేస్తున్నారన్న విషయాలు అధికారులందరికీ తెలుసు. నోరు తెరిస్తే.. పై నుండి ఫోన్లు వస్తాయని.. భయాందోళనతో మెజార్టీ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారట. కొంతమందికి మొదట స్థలాలు కేటాయిస్తున్నారు.. ఆ స్థలాలు మాకిస్తే.. ఎంతో కొంత ముట్టజెబుతామని ఎవరైనా ముందుకు వస్తే.. మొదట ఇచ్చిన వారికి రద్దు చేస్తూ.. సొమ్ములు ఇచ్చిన వారికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. చివరకు రెవిన్యూ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల బంధుమిత్రులకు, కుటుంబసభ్యులకు ఖరీదైన స్థలాలు కేటాయించారని ఆధారాలతో రుజువు చేస్తామని ప్రతిపక్ష నేతలు సవాల్‍ విసురుతున్నారు.

మొదటి జాబితాలో మా పేరు లేవు.. సొమ్ములు ఇచ్చినా కూడా మాకు స్థలాలు ఇవ్వరా.. అని కొందరు మహిళలు నిలదీస్తే.. రెండో జాబితాలో పెడతామంటున్నారు. అర్హులైన వారికి కాదని.. అనర్హులైన వారికి అందజేస్తున్నారని.. పలువురు తాహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా… మాది ఏముంది.. ఎమ్మెల్యేనో.. మంత్రినో కలవండి అని చేతులు ఎత్తేస్తున్నారట. ఇళ్ల స్థలాల కేటాయింపులో చాలా చోట్ల లవకతవకలు జరిగాయని లబ్ది దారులు వీదికెక్కారు.వీఆర్వోలు, వీఆర్‍ఏలు అవకతవకలకు పాల్పడుతున్నారని.. వారిని ప్రశ్నిస్తే..అ సభ్యంగా ప్రవర్తించారంటూ.. పోలీస్‍ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సంఘటనలు జరిగాయి. స్థలాల కేటాయింపు లాడ్రి పద్దతిలో జరగాల్సిఉండగా.. అధికార పెద్దల సూచనల ప్రకారమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *