Sat. Oct 24th, 2020

ఇలాగే కొనసాగితే..!

social distance

social distance

కరోనా మహమ్మారి జల్లాలను కమ్మేస్తుంది.. గ్రీన్‍, ఆరెంజ్‍, రెడ్‍ జోన్లు దాటి డేంజర్‍ జోన్‍లోకి కరోనా వ్యాది తీసుకెళ్లిపోతుంది. ఇకనైనా బాధ్యత గుర్తించకుంటే… భారీ మూల్యం చెల్లించక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.అ ప్రమ్తంగా లేకుంటే.. ఆసుపత్రిలో పడాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించండి.. భౌతిక దూరం పాటించండి.. ఇళ్లు, వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా భూతాన్ని తరిమి కొట్టండి అని మైకుల ద్వారా గ్రామాలలో, నగరాలు, పట్టణాలలో ఉన్న సందులలో కూడా ప్రచారం చేయిస్తున్నా.. మెజార్టీ ప్రజలు ఆ ప్రచారాన్ని పట్టించుకోవటం లేదు. వ్యక్తిగత జాగ్రత్తలతో కరోనాకు చెక్‍ పెట్టండి భౌతిక దూరం పాటించండి అని చెబుతున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు.అందుకే రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే.. ప్రజలందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

వ్యక్తిగత జాగ్రత్తలను పాటిచటంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వహించవద్దు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్థాయి నుండి మండల స్థాయి అధికారుల వరకు సూచనలు చేస్తున్నా.. జనానికి పట్టడం లేదు. కొంతమందికి కరోనా బయట పడ్డా.. నిర్లక్ష్యం వహిస్తున్నారు. కుటుంబసభ్యులుకూడా దాచి పెడుతున్నారు. చివరకు కరోనా వచ్చిన వ్యక్తితో పాటు కుటుంబసభ్యులకు,ఆ వ్యక్తిని కలిసిన వారందరికీ కరోనా సోకి ఆసుపత్రి పాలు చేస్తుంది. కరోనాను దరిచయనివ్వకుండా ఉండాలంటే.. మాస్కులు దరించటం, శానిటైజర్‍ను ఉపయోగించటం, భౌతిక దూరం పాటించాలి. లేకుంటే.. కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. పలు నగరాలు, పట్టణాలు, చివరకు గ్రామాలలో కూడా కరోనా రోజు రోజుకు తీవ్రం అవుతోంది. గత 15, 20 రోజుల నుండి కరోనా కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి.

లాక్‍డౌన్‍ సమయంలో కరోనా కట్టడి అయింది. లాక్‍డౌన్‍సడలింపులతో కరోనా వ్యాధి పెరిగిపోవటానికి ఇతర రాష్ట్రాల నుండి కరోనా వ్యాధితో పెద్దసంఖ్యలో కార్మికులు, కూలీలు, ఉద్యోగులు రావటంతో కారణం అయింది. కరోనా ను కట్టడి చేయలేని పరిస్థితులు ముందు ముందు ఏర్పడినా.. ఆశ్చర్యపడక్కర్లేదు. నాకు ఏంకాదు.. నాకు కరోనా వ్యాది రాదులే.. వచ్చినా నన్ను ఏమి చేయలేదులే.. మాకు తెలిసిన వారికి కరోనా వచ్చింది.. ఆ తరువాత తగ్గింది.. అలాంటిది నన్ను ఏమి చేస్తుందిలే అని భ్రమల్లో ఉన్నవారు కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని సూచిస్తున్నారు. రాబోయే రోజులలో కరోనా కేసులు ఎన్ని రెట్లు పెరుగుతాయో అని అధి•కారులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపధ్యంలో కరోనా బారిన పడకుండా ఉండాంటే… ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తమ దాకా వస్తే.. కానీ పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్లక్ష్యం కొంప ముచబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *