Tue. Sep 22nd, 2020

నెంబర్‍ 2 లేనట్లేనా..?

vijayasai reddy

vijayasai reddy

మొన్నటి వరకు ప్రభుత్వంలో, పార్టీలో జగన్‍ తరువాత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రభావం ఉండేది. విజయసాయిరెడ్డి రాజకీయంగా, అధికారంగా ఒక వెలుగు వెలిగారు. ఐఎఎస్‍ అధికారులు కూడా విజయసాయిరెడ్డిని రహస్యంగా కలిసేందుకు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించారు. వారిలో కొందరు కలవగలిగారు. మరి కొందరు కలవలేకపోయారు. ఇదంతా గతం. ఇటీవల ఏం జరిగిందో ఏమో కానీ విజయసాయిరెడ్డిని ముఖ్యమంత్రి దూరం పెట్టారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో నెంబర్‍ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఎలాంటి హోదా లేకుండా మౌనంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ట్విట్టర్‍ ద్వారా చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. తానున్నాని గుర్తు చేస్తున్నారు. జగన్‍ తరువాత అధికారం చెలాయించాలని ఆశపడ్డ విజయసాయికి కోలుకోలేనంత ఎదురు దెబ్బ తగిలింది.. ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకునే సందర్భంలో విజయసాయిరెడ్డిని పట్టించుకోలేదట. విజయసాయిరెడ్డి వ్యవహారంపై మీడియాలో రక రకాలుగా కధనాలు ప్రచారం అవుతున్నాయి.

ఏదో జరిగి ఉంటుంది.. ఏం జరిగిందో మాకు తెలీదు. కానీ విజయసాయిరెడ్డిని ముఖ్యమంత్రి దూరం పెట్టిన మాట వాస్తవమే. ఈరోజు దూరం పెట్టిన విజయసాయిరెడ్డిని రేపు కలుపుకోరని నమ్మకం ఏమిటి అని కొందరు మంత్రులు చెబుతున్నారు. జగన్‍కు, ఆయన కుటుంబానికి విధేయుడిగా ఉంటానని విజయసాయి చెబుతున్నా జగన్‍ పట్టించుకోవటం లేదు. ఆ పరిస్థితులు వచ్చాయని విజయసాయే పరోక్షంగా చెబుతున్నారు. విజయసాయిరెడ్డిపై గతంలో తెలుగుదేశం నేతలు కానీ.. చంద్రబాబు కానీ దాడి చేస్తే. కొంత మంది ఖండించేవారు.. మరి కొందరు ఎదురు దాడి చేసేవారు. ఇప్పుడు పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ నెంబర్‍2 పోస్టు లేదు. ఉన్నది ఒకటే పోస్టు దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే అని స్పష్టమవుతుదంటున్నారు రాజకీయ పరిశీలకులు. విజయసాయిరెడ్డి మంచివారే.. కానీ ఆయన అప్పుడప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వాస్తవాలు ఉన్నా.. లేకున్నా.. విమర్శలు, ఆరోపణలు చేసేవారు.

టిడిపి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా విమర్శలు, ఆరోపణలకు ధీటుగా స్పందించేవారు. కేంద్ర బిజెపి పెద్దలతో.. కేంద్ర ప్రభుత్వ అధికారులతో లాబియింగ్‍ చేయటంలో ఆయనకున్న చాకచక్యం జగన్‍ పార్టీలో ఎవరికీ లేదనేది వాస్తవం. కానీ విజయసాయిరెడ్డికి ఇలాంటి పరిస్థితులు ఎదురైన నేపధ్యంలో ఆయనను మొదటి నుండి వ్యతిరేకించే జగన్‍ సామాజికవర్గ ముఖ్య నేతలు లోలోపల ఆనందిస్తున్నారట. ఏది ఏమైనా మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డికి ప్రస్తుతం టైం బాగాలేదనుకోవాలి. జగన్‍ ముఖ్యమంత్రి అవటమే నా లక్ష్యం. నా కోరిక.. నా కోరిక తీరింది. జగన్‍ ముఖ్యమంత్రి అయ్యారు. అధికార విషయంలో నేను తలదూర్చను. అన్ని పైరవీలకు దూరంగా ఉంటాను. అధికారులకు కూడా నేను దూరంగా ఉంటాను అని జగన్‍ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల ముందు విజయసాయిరెడ్డి చేసిన ప్రమాణాన్ని కొందరు గుర్తు చేశారు. అప్పుడు ఆయన కలవద్దు అన్నా.. మంత్రులు, అధికారులు కలిసేవారు. ప్రస్తుతం ఆయనకు కాలం సహకరించటం లేదు. ముందు ముదు ఆయన ఒంటరిగా మిగిలిపోవటం ఖాయమని ఆయను వ్యతిరేకించే జగన్‍ పార్టీ ప్రముఖులు అంటున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *