Tue. Sep 22nd, 2020

పశ్చిమ గోదావరిలో ‘రాజు’కున్న వివాదం..!

raghu ram krishnam raju

raghu ram krishnam raju

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్‍ నియోజవర్గ ఎంపీ రఘురాంకృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సంచలనం సృష్టించింది. ఈ మధ్య కాలంలో వరుసగా పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్యలు చేయటం.. ఆ వ్యాఖ్యలకు ధీటుగా పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు ప్రతిస్పదించటం వాటన్నింటిని అధిష్టానం తేలికగా తీసుకోవటంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. జిల్లాలో అత్యంత కీలకంగా ఎమ్మెల్యేలు మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఎంపీలను ఎమ్మెల్యేలు, అధికారులు పట్టించుకోవటం లేదు. ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కరూ సకరించకపోవటం.. సమీక్షలు, సమావేశాలు, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఎంపీ రఘురాం కృష్ణంరాజుకు సమాచారమే అందలేదట.

ఈ విషయంపై పలు దఫాలు ఆయన బాహాటంగా స్పందించిన సందర్భాలున్నాయి. రఘురాంకృష్ణంరాజు దూకుడుకు ఏ విధంగా కళ్లెం వేయాలనే లక్ష్యంతో పార్టీలో కొందరు పావులు కదిపారట. ఆయన సహాయ నిరాకరణను ప్రారంభించినా ఎంపీ అవేమి పట్టించుకోకుండా.. స్వతంత్రంగా వ్యవహరిస్తూనే వచ్చారు. నరసాపూర్‍ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు తెలియకుండా గోకరాజు గంగరాజును నియమించటం జరిగింది. అయినా ఎంపీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అవినీతి వ్యవహరంపై నిగ్గదీశారు. అక్రమ ఇసుక వ్యాపారాలపై విరుచుకుపడ్డారు. చివరకు తాను కూడా ఇసుక ఇప్పించలేని పరిస్థితి ఉందని చెప్పారు. ప్రజా సమస్యలపై స్పందించేందుకు ఎంపీ టోల్‍ ఫ్రీ నెంబర్‍ను ఏర్పాటు చేశారు. ఈ నెంబర్‍కు అనేక మంది ప్రజలు ఫిర్యాదు చేయటం.. ఎంపీ కార్యాలయ సిబ్బంది స్పందించి సంబందిత అధికారుల దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. ఈ సమస్యలపై ఎంపీ ప్రతి రోజు కొంత సమయన్ని కేటాయించుకున్నారు. అనేక నియోజకవర్గాలలో తనకు తెలియకుండా వేరొకరికి ప్రాధాన్యత ఇవ్వటంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించటాన్ని ఎంపీ తప్పుపట్టారు. మంత్రి రఘునాద్‍రాజుకు ఎంపీ రఘురాంకృష్ణంరాజుకు మధ్య ఏర్పడిన విభేదాలు ముదిరాయి. కొన్ని నియోజకవర్గాలలో ఇళ్ల స్థలాల అమ్మకం జరిగినట్లు రఘురాం కృష్ణం రాజుకు ఫిర్యాదులు అందాయట. అందుకు ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంపీపై విరుచుకు పడ్డారు. పార్టీలో కొందరు ఎవరి అంతట వారు వ్యవహరించే తీరుతో పాటు.. ఇసుకతో సహా అనేక అంశాలను ఎంపీ ప్రస్తావించటం.. వాటిపై వ్యాఖ్యలు చేయటం.. తనను బతిమాలితేనే పార్టీలోకి వచ్చి పోటీ చేశానని చెప్పటంతో స్థానిక అధికార ప్రజాప్రతినిధులు మొదట్లో మౌనం వహించినా.. తరువాత అధిష్టానం ఒత్తిడితో ఎంపీపై ఎదురు దాడి ప్రారంభించారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ.. దూసుకుపోతున్న ఎంపీపై అధికార పార్టీ నేతలు అసూయ పడ్డారని ఎంపీ అనుచరులు అంటున్నారు. గత రెండు రోజుల నుండి పలు మీడియా వర్గాలలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి పుట్టించాయి. ఇవన్నీ దావానం లా వ్యాపించటంతో ఎంపీపై అధిష్టానం ఏ చర్య తీసుకోబోతుందో వేచి చూడాల్సిందే. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీ రఘురాంకృష్ణంరాజుపై దుమ్మెత్తిపోస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *