Tue. Sep 22nd, 2020

విశాఖ నగరంలో పికే టీం హడావిడి

Vizag, pk

Vizag, pk

చంద్రబాబు అధికారం కోల్పోవటానికి ముఖ్యకారకులైన ప్రశాంత్‍ కిషోర్‍ ఆయన టీం సభ్యులు.. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి. లబ్దిదారులకు జగన్‍ ప్రభుత్వంపై సానుభూతిని ఎలా పెంచాలి అని వలంటీర్లు కు శిక్షణ ఇవ్వబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఇప్పటికే ప్రశాంత్‍కిషోర్‍ మరియు ఆయన టీం సభ్యులు విశాఖ నగరానికి చేరుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే విశాఖ నగరంలోని కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ నాయకులకు ప్రశాంత్‍ కిషోర్‍ టీం సభ్యులు తాము వచ్చిన పని గురించి వివరించారట. త్వరలోనే వార్డు వలంటీర్లతో సమావేశం అయ్యేందుకు తేదీని నిర్ణయించుకున్నారట. జగన్‍ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. తిరిగి మళ్లీ అధికారం కైవసం చేసుకోవాలనే విషయంపై జగన్‍ దృష్టి పెట్టారు. అందుకే ప్రశాంత్‍ కిషోర్‍ను మళ్లీ రంగంలోకి దించారట.

2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‍ కాంగ్రెస్‍ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్‍ కిషోర్‍ ఇటీవలె ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో (ఏపీ మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు) తెరవెనుక మాట్లాడుతూ ఎన్నికలలో చంద్రబాబును ఓడించి జగన్‍ను గెలిపించి తప్పుచేశానని.. పశ్చాత్తాపం వ్యక్తం చేశారట. ఆంధ్ర రాష్ట్రం అభివృద్దికి నోచుకోకపోవటానికి తానే కారణమని.. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే.. అభివృద్దిలో మొదటి స్థానంలో ఉండాల్సిన ఏపీ క్రమ క్రమంగా చివరి స్థానానికి దిగజారవచ్చునని ఆవేదన వ్యక్తం చేశారట. ఆ విధంగా ఆవేదన వ్యక్తం చేసిన ప్రశాంత్‍ కిషోర్‍కు మళ్లీ జగనే దిక్కయ్యారేమో..? అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రశాంత్‍ కిషోర్‍ జగన్‍ను స్వయంగా వచ్చి కలిశారని కూడా ప్రచారం జరుగుతోంది. తాము అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పధకాలు సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయా… లేదా అనే విషయం తెలుసుకోవాలనే ఆలోచనతో.. తనను కలిసిన ప్రశాంత్‍ కిషోర్‍కు ఆ బాధ్యతలు జగన్‍ అప్పజెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్న కాక మొన్న జగన్‍ సిఎం అవటం వలన ఏపీ నాశనం అయింది అని ఆవేదన వ్యక్తం చేసిన ప్రశాంత్‍ కిషోర్‍ మళ్లీ ఏం ఆశించి జగన్‍ను కలిసి ఉంటారో..? అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ప్రశాంత్‍ కిషోర్‍ కొతమంది టీం సభ్యులను రంగంలోకి దించారట. వలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు తాము వచ్చామని ఈవిషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సహకరించాలని, ఇదంతా జగన్‍ ఆదేశాలతో నిర్వహిస్తున్నామని వారు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను లబ్ది దారులకు అందజేయటంతో పాటు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించేలా వార్డు వలంటీర్లుకు శిక్షణ ఇవ్వబోతున్నట్లు పికె టీం సభ్యులు తెలిపారట. వారు గ్రామ సచివాలయంలో వివిధ హోదాలలో పనిచేస్తున్న వారికి, వార్డు వలంటీర్లుకు వాట్సాఫ్‍ గ్రూప్‍ క్రియేట్‍ చేయబోతున్నారు. వలంటీర్లులో ముందుగా జగన్‍ విధేయులును గుర్తించాలి. ఎవరైనా వ్యాతిరేకంగా వారిని అనుకూలంగా మలుచుకోవాలి. అప్పటికీ దారిలోకి రాకపోతే ఏదో ఒక కారణంతో ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో పికే టీం సభ్యులు వలంటీర్లతో, గ్రామ సచివాలయ సభ్యులతో మీటింగ్‍ ప్రారంభించగా.. విశాఖ నగరంలో మరో వారం రోజులలో మీటింగ్‍ ప్రారంభించబోతున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *