Sat. Oct 24th, 2020

విశాఖలో..అవంతి,అమరనాధ్‍ల మధ్య ఆధిపత్య పోరు..!

avanthi, amarnath

avanthi, amarnath

విశాఖ జిల్లా అధికార పార్టీలో రసవత్తరమైన రాజకీయాలకు తెరదీస్తున్నాయి. మంత్రి పదవి నిలుపుకునేందుకు ఒకరు.. మంత్రి పదవి పొందేందుకు మరొకరి మధ్య రాజకీయ అధికార ఆధిపత్య పోరు ప్రారంభమయింది. ఆ ఇద్దరిలో ఒకరు జగన్‍కు అత్యంత సన్నిహితులు. మరొకరు ఎన్నికల ముందు అధికార పార్టీలో చేరి ఎన్నికలలో విజయం సాధించిన మంత్రి పదవి పొందారు. మంత్రి పదవి పొందింది అవంతి శ్రీనివాస్‍ కాగా.. సిఎం జగన్‍కు వీరవిధేయుడైన అమరనాధ్‍ 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యే అమరనాధ్‍ కుటుంబ సభ్యులందరూ రాజకీయ నాయకులే. మంత్రి అవంతి శ్రీనివాస్‍కు వ్యాపారిగా పేరుంది. మంత్రి పదవిని నిలుపుకునేందుకు… సిఎం జగన్‍ను మెప్పించేందుకు నిత్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవంతి శ్రీనివాస్‍ విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. 2019 ఎన్నికల ముందు వరకు అవంతి శ్రీనివాస్‍ చంద్రబాబుకు విధేయుడిగా ఉండేవారు. రాజ్యసభ సభుడు విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది.

ఇటీవల విజయసాయిరెడ్డిని జగన్‍ దూరం పెట్టిన నేపధ్యంలో మంత్రి శ్రీనివాస్‍ జగన్‍ మెప్పు పొందేందుకు.. ఆకర్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారట. మూడు రాజధానులు విషయంలో మంత్రి అవంతి శ్రీనివాస్‍, ఎమ్మెల్యే అమరనాధ్‍లు జగన్‍ నిర్ణయాన్ని స్వాగతించటమే కాకుండా.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేయటంలో మంత్రి అవంతి శ్రీనివాస్‍, ఎమ్మెల్యే అమరనాధ్‍లు పరస్పరం పోటీ పడుతున్నారట. అవంతి శ్రీనివాస్‍ మంత్రి పదవి మరో సంవత్సరం వరకు ఢోకా ఉండదని.. రెండు సంవత్సరాల తరువాత మంత్రి పదవి నుండి అవంతిని తొలగించి అమరనాధ్‍కు మంత్రి పదవి ఇవ్వటం ఖాయమని.. విశాఖ రాజకీయాలను బట్టి స్పష్టమవుతోంది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే అమరనాధ్‍ మంత్రి అవంతికి మధ్య పరోక్ష వ్యంగ్య విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. నేను జగన్‍కు వీర విధేయుడను.. మంత్రి అవంతి శ్రీనివాస్‍ ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చారు. అదృష్టం కలిసి వచ్చి విజయసాయి ఆశీస్సులతో మంత్రి పదవి పొందారు. అప్పట్లో విజయసాయిరెడ్డి హవా నడుస్తుండటంతో.. అవంతిని మంత్రిని చేసిందని.. లేకుంటే.. తనకే మంత్రి పదవి దక్కేదని అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాధ్‍ చెబుతుంటారు. ప్రస్తుత మారిన రాజకీయ పరిస్థితులు నేపధ్యంలో అవంతి మరో ఏడాది మంత్రిగా కొనసాగే అవకాశాలున్నాయి. సంవత్సరం గడిచింది.. మరో సంవత్సరం ఇట్టే గడిచిపోతుంది.. తనకు మంత్రి పదవి ఖాయమంటున్నారు ఎమ్మెల్యే అమరనాధ్‍.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *