Fri. Nov 27th, 2020

సచివాలయంలో ఐఎఎస్‍లను వెంటాడుతున్న కరోనా..!

ap secratariat, ias

ap secratariat, ias

నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ ఉద్యోగులను, క్రింది స్థాయి అధికారులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి క్రమ క్రమంగా ఐఎఎస్‍ అదికారులను కూడా తాకింది. గతంలో సిఎంవో ఐఎఎస్‍ అధికారికి, ఇద్దరు మహిళా ఐఎఎస్‍ అధికారులకు కరోనా సోకటం.. వారు ఆసుపత్రిలలో చేరి హోం క్వారంటైన్‍లో ఉండటంతో.. వారు ఆ వ్యాది తగ్గి మళ్లీ విధులలో చేరారు. ఆ తరువాత గుంటూరు జిల్లా కలెక్టర్‍తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా జులై 17 వ తేదీన కరోనా సోకిందని బయట పడింది. ఆయన కూడా హోం క్వారంటైన్‍కే వెళ్లారు. తాజాగా విజిలెన్స్ కమీషనర్‍ వీణాఈష్‍ ఆమె కుటుంబ సభ్యులకు, ఆ తరువాత ఆర్దిక శాఖలో పనిచేసే ఐఎఎస్‍ అధికారి కార్తికేయ మిశ్రాకు కరోనా సోకిందని బయట పడింది. అంతే కాకుండా ఎక్సైజ్‍, కమర్షియల్‍ ట్యాక్స్, రిజిస్ట్రేషన్‍ మరియు స్టాంపుల శాఖాదిపతి రంజిత్‍ భార్గవకు కూడా కరోనా సోకిందని ఆయన హోం క్వారంటైన్‍లో ఉండి ట్రీట్‍ మెంట్‍ తీసుకుంటున్నారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కాలంలో సచివాలయంలో (అసెంబ్లీ సచివాలయం) కూడా క్రింది స్థాయి అధికారులకు, ఉద్యోగులకు 60 నుండి 70 కేసులు బయట పడగా.. మరో 10 నుండి 15 కేసులు ఫలితాలు పెండింగ్‍లో పెట్టడంతో.. వారికి కూడా కరోనా సోకిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడైతే సచివాలయంలో ఐఎఎస్‍ అధికారులకు కరోనా సోకిందని బయట పడిందో.. సచివాలయ క్రింది స్థాయి అధికారులు, ఉద్యోగులు భయాందోళనలతో కనిపిస్తున్నారు. సచివాలయంలో అన్ని శాఖలలో పని చేసే ఉద్యోగులలో కరోనా పాజిటివ్‍ బయట పడినప్పటికీ.. రెవిన్యూ శాఖలో పనిచేసే వారికి కరోనా వ్యాది ఇంత వరకు బయట పడక పోవటానికి కారణం ఆ శాఖాదిపతి క్రింది స్థాయి అధికారులకు, ఉద్యోగులకు హోమియో మందు ఇప్పించటం వలనే ఆ వ్యాది మాకు సోకలేదని ఉద్యోగులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *