Tue. Sep 22nd, 2020

సచివాలయంలో కరోనా విలయ తాండవం..!

ap secratariat

ap secratariat

వెలగపూడి సచివాలయంలో రోజు రోజుకు కరోనాకేసులు పెరిగిపోతున్నాయి. అనేక బ్లాక్‍లలో పనిచేసే ఉద్యోగులకు కరోనా బయట పడినప్పటికీ.. ఆయా బ్లాక్‍లను కంటైన్మెంట్‍ జోన్‍గా ఉంచటం లేదు. సుమారు 50 మందికి కరోనా బయట పడినట్లు ప్రచారం జరుగుతోంది. సచివాలయంలో వివిధ హోదాలలో పని చేసే అధికారులకు, ఉద్యోగులకు కరోనాపై రోజు రోజుకు భయం పెరిగిపోతున్నా.. వారిని ఇంటి దగ్గర నుండే పని చేయమని కానీ.. లేక ఒక వారం 30 శాతం మంది, మరో వారం 30 శాతం మంది, ఆ తరువాత మిగతా 30శాతం మంది… పనిచేసేందుకు అనుమతి ఇవ్వకుండా.. అధికారులు, ఉద్యోగులందరూ తప్పనిపరిగా సచివాలయానికి రావాల్సిందే అని ముఖ్యమంత్రి సిఎస్‍ను ఆదేశించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిస్తే.. తాను నిమిత్త మాత్రురాలునని ప్రభుత్వ ఆదేశాలను పాటించటమే నా విధి అని మీరు కూడా ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి పనిచేయాల్సిందే అన్నారట.

నగరాలు, పట్టణాలు,ఇతర ప్రాంతాలలో కరోనా కేసులు బయట పడితే.. కంటైన్మెంట్‍ జోన్‍ గా ప్రకటిస్తూ.. హౌస్‍ క్వారంటైన్‍లో ఉండాలని అదికారులు చెబుతున్నారు. ఆయా నిబందనలు నగరాలు, పట్టణాలలో అమలు అవుతున్నప్పటికీ.. సచివాలయంలో అమలుకు నోచుకోవటం లేదని ఉద్యోగులు అంటున్నారు. సచివాలయంలో పనిచేసే కొంతమంది అధికారులు, ఉద్యోగులు ప్రైవేటుగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. అలా చేయించుకుంటున్న వారిలో ఎంతమదికి పాజిటివ్‍, ఎంతమందికి నెగటవ్‍ వచ్చిందన్న విసయం బయట పడటంలేదు. మొదటి సారి అందరూ కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆ తరువాత అనుమానాలుంటేనే పరీక్షలు చేయించుకోండి అని అధికారులు సూచించారు. ఎంతమంది ప్రైవైటుగా కరోనా పరీక్షలు చేయించుకన్నారు. ఎంతమంది అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు అనే విషయం బయట పడటం లేదు. ఇప్పటికైనా సచివాలయంలో కనీసం 15 రోజుల పాటు లాక్‍డౌన్‍ విధించిన అధికారులు, ఉద్యోగులందరూ ఇంటి దగ్గర నుండి పనిచేసే అవకాశం ఇవ్వకపోతే.. ప్రమాదకరమైన పరిస్థితులు బయట పడతాయన్న ఆందోళనలో ఉద్యోగులు కనిపిస్తున్నారు. సచివాలయానికి అందరూ తప్పనిసరిగా రావాలి.. బాధ్యతలు నిర్వహించాలని పాలకులు ఎందుకు అంత మొండిగా ఉన్నారన్న విషయం పాలకులకు, అధికారులకు అంతు బట్డం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *