Wed. Oct 21st, 2020

లిక్కర్‍ అమ్మకాలలో గోల్‍మాల్‍

liquor

liquor

ఆంధప్రదేశ్‍లో దశల వారీగా సంపూర్ణ మద్య పానం నిషేదం విధిస్తామని.. ముఖ్యమంత్రి జగన్‍ పదే పదే చెప్పారు.. ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. అందుకే కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టామని సిఎం అంటున్నారు. మద్యం ధరలు రెండింతలు పెంచి వినియోగం తగ్గించటానికి చర్యలు తీసుకున్నామని.. చెబుతున్నారు. కానీ పాత బ్రాండుల సరఫరాను పూర్తిగా తగ్గించారు. కొత్త బ్రాండులతో పాటు పాత బ్రాండుల ధరలను పెంచి అమ్ముతున్నారు. పాత బ్రాండు కొనేందుకు ఎక్కడా దొరకటం లేదు. కొత్త బ్రాండును కొనకా.. మందు బాబులకు తప్పటం లేదు. ఇంతకు ముందు ఎన్నడూ లేని మందు బాటిళ్లు వైన్‍ షాపులలో ప్రత్యక్షం అవుతున్నాయి. వైన్‍ షాపులలో అమ్ముతున్న కొన్ని మందుల సరఫరా ప్రభుత్వ అండదండులున్న కొందరు పెద్దల కంపెనీలలో తయారు అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బ్రాండెడ్‍ మద్యం అయిన మేన్షన్‍ హోస్‍, మార్పీఎస్‍, ఖైరాన్‍ బ్రాందీ (షుగర్‍ పేషెంట్లు త్రాగే లిక్కరు), యువత ఎక్కువ తాగే బ్లెండర్‍ స్పైడ్‍, టీజస్‍, జానీ వాకర్‍, యాంటీ క్లిప్‍లు, బ్లాక్‍ డాగ్‍, వ్యాట్‍ 69, అండర్‍ ప్రైపర్స్, అరిస్ట్రోకాట్‍ ఇలా పలు రకాల పాత బ్రాండులలో కొన్ని మాత్రమే డిపోల నుండి దుకాణాలకు వస్తున్నాయి. ఎంత సరుకు వచ్చిందనే విషయాలను దాచేస్తున్నారు. కొత్త బ్రాండులను చూపుతున్నారు. కొంటే కొనాలి.. లేకపోతే లేదు అని సేల్స్మేన్‍లు మందుబాబులకు తెగేసి చెబుతున్నారట. దీంతో చేసేది లేక మందు బాబులు ఆ మందు బాటిళ్లనే కొంటున్నారట. పాత బ్రాండులను దాచి పెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారని బయట పడుతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇంతకు ముందు బెల్టుషాపులను బహిరంగంగానే నిర్వహించేవారు. వాటి కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఎప్పుడైతే మద్యం దుకాణాలను ప్రభుత్వ పరిదిలోకి వెళ్లాయో.. అప్పటి నుండి బెల్లు షాపులు కొద్ది పడుతున్నాయి.

వివిధ నగరాలు, పట్టణాలలోని శివారు ప్రాంతాలలో చిన్న చిన్న కిరాణా కొట్టు నిర్వాహకులు, పాన్‍ షాపులు నిర్వహించేవారు.. తమ పరిదిలోని మద్యం దుకాణాల నుండి బాటిళ్లు కొంటున్నారు. వాటిని వేరే వారికి గుట్టు చప్పుడు కాకుండా అదనపు ధరలకు అమ్ముతున్నారు. గతంలో మద్యం అమ్మకాలను ఎక్సైజ్‍ సిబ్బంది, అధికారులు పర్యవేక్షించేవారు. తాజాగా స్పెషల్‍ ఎన్‍ఫోర్స్మెంట్‍ బ్యూరోను ప్రవేశ పెట్టడంతో ఎక్సైజ్‍ శాఖలోని సగం పైగా సిబ్బందిని ఎస్‍ఈబిలోకి పంపటం జరిగింది. ప్రస్తుతం ఎక్సైజ్‍ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది మద్యం షాపులలో ఏం జరుగుతుందా అని కనిపెట్టలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సూపర్‍వైజర్లు, వారికి సహకరిస్తున్న సేల్స్మెన్‍లు పాత బ్రాండ్‍ అమ్మకాలలో పరస్పరం సహకరించుకుంటూ ఎవరికి అందినంత వారు వెనకేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *