Sat. Oct 24th, 2020

వైద్య ఆరోగ్య శాఖలో ఇద్దరూ సమర్దులే..!

jawahar reddy, bhasker

jawahar reddy, bhasker

వైద్య ఆరోగ్య శాఖలో ఆ శాఖాదిపతి జవహర్‍రెడ్డితో పాటు ఫ్మామిలీ వెల్‍ఫేర్‍ కమీషనర్‍ భాస్కర్‍లు మంత్రి జగన్‍ ప్రోత్సాహంతో, ఆయన ఇస్తున్న సూచనలతో రాత్రింబవళ్లు నిజాయితీగా, సమర్ధవంతంగా పనిచేస్తున్నారని.. విశ్వసనీయ వర్గాల సమాచారం. కరోనా వ్యాధి రోజు రోజుకు ప్రబలుతున్నప్పటికీ… కరోనా వ్యాధి పరీక్షలను ఇప్పటి వరకు పది లక్షలు పైగా నిర్వహించటంతో సిఎం జగన్‍ జవహర్‍రెడ్డి, భాస్కర్‍లను అభినందించినట్లు తెలిసింది. ఈ ఇద్దరు ఐఎఎస్‍ అధికారులు ఎంత కష్టపడుతున్నారో.. అందులో పది శాతం కూడా ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కష్టపడటం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ ఇద్దరు ఐఎఎస్‍ అధికారులు రాత్రింబవళ్లు ఎంత కష్టపడి చేస్తున్నారో.. ఆ శాఖ క్రింది స్థాయి అధికారులకు తెలుసు. కానీ వారి వలే పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు.

మాస్కులు, కిట్లు కొనుగోళ్లలో ఎక్కడా ఎలాంటి విమర్శలు లేకుండా.. సమర్ధవంతంగా, పారదర్శకంగా జవహర్‍రెడ్డి, భాస్కర్‍లు వ్యవహరించారని పేరు వచ్చింది.. ఉదయం 8 గంటల నుండి.. అర్ధరాత్రి 12.00గం.ల వరకు వారు పనిచేస్తూనే ఉన్నారు. నిత్యం ముఖ్మమంత్రిని జవహర్‍రెడ్డి, భాస్కర్‍లు కలుస్తూనే ఉంటారు. ఇంతకు ముందు జరిగిన విషయాలపై చర్చిస్తున్నారు. కానీ వీడియో కాన్ఫరెన్స్లతో కొన్ని గంటల సమయం వృదా అవుతుందని విమర్శలు వస్తున్నాయి. పనిచేసే వారిని పనిచేయనివ్వకుండా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించి సమయాన్ని ఒకరిద్దరు వృధా చేస్తున్నారట. ఈ సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ల కన్నా.. ఆఫీసులో కూర్చుని పని చేసుకోనివ్వండి. జిల్లా అదికారులతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉంటాయి అని వీరు నోరు విప్పి చెప్పలేరు.

ఈ విషయాన్ని వారు పట్టించుకోకుండా సమయన్ని వృదా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి ఉన్నా.. లేనట్లే. ఆయన ఎక్కడా కనిపించడు. ఆయన మాటలు కూడా వినిపించటం లేదు. అప్పుడప్పుడు సమీక్షలు, సమావేశాలలో తెరపైన కనిపిస్తుంటారు. మంచి అవకాశం వచ్చింది. కష్టపడి పని చేద్దామని ఆలోచన మంత్రికి లేదేమో. ఏది ఏమైనా వైద్య ఆరోగ్య శాఖలో తాజాగా ఉన్నతాధికారులు ఇద్దరు సమర్ధవంతంగా, పారదర్శకంగా పనిచేస్తున్నారన్న విషయం ఆ శాఖలో పనిచేస్తున్న ఎవరిని అడిగినా చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *