Tue. Sep 22nd, 2020

గుంటూరులో మంత్రి పదవి దక్కేది ఎవరికో..?

guntur mlas

guntur mlas

గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపికైన నేపధ్యంలో ఆయన త్వరలో మంత్రి పదవికి రాజీనామా చేయటం ఖాయం. ఆయన స్థానంలో మంత్రి పదవి ఎవరికి దక్కబోతుంది అనే విషయంపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బిసి కోటాలో తనకే మంత్రి పదవి లభిస్తుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ హడావిడిచేస్తున్నారట. లేదు కాసు మహేష్‍రెడ్డికి మంత్రి పదవి దక్కటం ఖాయమని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి మంత్రి పదవి దక్కే అవకాశాలు లేనే లేవు. కాపు సామాజికవర్గానికి చెందిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రి పదవి ఆశిస్తున్నారు.

కానీ ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే విషయంపై జగన్‍ పార్టీ ముఖ్యులు ఎలాంటి అనుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం లేదు. అదే సామాజికవర్గానికి చెందిన శాసనమండలి చీఫ్‍ విప్‍ ఉమారెడ్డి వెంకటేశ్వర్లుకూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారట. ఒకవేళ తనకు మంత్రి పదవిని దక్కకపోయినా.. తన అల్లుడు కిలారి రోశయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఉమారెడ్డి కోరవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం. చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ బిసి సామాజికవర్గానికి చెందినవారు. ఆమె భర్త కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావటంతో.. అటు బిసి సామాజికవర్గానికి మంత్రి పదవి ఇచ్చినట్టుంది. ఇటు కాపు వర్గాన్ని కూడా సంతృప్తి పరిచినట్టు ఉంటుందని ఆమె అనుచరులు చెబుతున్నారు. గతంలో విజయసాయిరెడ్డి ద్వారా పార్టీలో చేరి ఎమ్మెల్యే టిక్కెట్టు తెచ్చుకుని విజయం సాధించిన రజనీ ఆయన ద్వారానే మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజకీయ పరిస్థితి బాగా లేకపోవటంతో ఏదో విధంగా లబ్ది పొందాలని ఎమ్మెల్యేరజనీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

కమ్మ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వరు. రెడ్డి సామాజికవర్గానికి మంత్రి పదవి ఇస్తారా లేదా అనే విషయం బయట పడటం లేదు. కాపు సామాజికవర్గ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.గుంటూరు జిల్లాలో మంత్రి పదవి ఇవ్వకపోతే నష్టం ఏమిటి అని ముఖ్యమంత్రి భావిస్తే.. ఈ జిల్లా ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కకపోవచ్చు. ఒక వేళ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే.. రాజకీయ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటారా.. లేదా కులాలను పరిగణనలోకి తీసుకుంటారా అనే విషయంపై జగనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *